స్కూల్ ఐడీ కార్డుల్లో కులం.. సీఎం విజయ్ నిర్ణయం
Actor ProfilePolitician

స్కూల్ ఐడీ కార్డుల్లో కులం.. సీఎం విజయ్ నిర్ణయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్కూల్ ఐడీ కార్డుల్లో కులం.. సీఎం విజయ్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు.. మండిపడుతున్న నెటిజన్స్
10TV Telugu1 Aug 2026
స్కూల్ ఐడీ కార్డుల్లో కులం.. సీఎం విజయ్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు.. మండిపడుతున్న నెటిజన్స్

CM Vijay: తమిళనాడు ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు జారీ చేయాలనుకున్న కొత్త గుర్తింపు కార్డుల్లో కులం వివరాలను చేర్చాలనే ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి సీఎం విజయ్(CM Vijay) ఆదేశాల మేరకు తొలిదశలో 10, 12 తరగతుల విద్యార్థులకు ఈ కార్డులను అందజేస్తామని, వాటిలో బ్లడ్ గ్రూప్, చిరునామాతో పాటు కుల వివరాలను కూడా పొందుపరుస్తామని విద్యాశాఖ మంత్రి సెంగోట్టయన్ ప్రకటించారు. ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌ల పంపిణీని మరింత సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం భావించినప్పటికీ, ఈ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Donald Trump: తెలంగాణ గవర్నమెంట్ కు ట్రంప్ థాంక్స్.. కారణం ఇదే! ఐడీ కార్డుల్లో కుల ప్రస్తావన తీసుకురావడంపై నెటిజన్లు, విద్యావేత్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. చిన్న వయసులోనే విద్యార్థుల గుర్తింపు కార్డులపై కులాన్ని ముద్రించడం వల్ల వారి మధ్య భేదభావాలు, వివక్ష పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో కులరహిత వాతావరణాన్ని ప్రోత్సహించాల్సింది పోయి, పాఠశాల స్థాయిలోనే ఇలాంటి విభజన రేఖలు గీయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కేవలం అడ్మిషన్లు, ప్రభుత్వ రికార్డులకు పరిమితం కావాల్సిన కుల వివరాలను, రోజూ ధరించే ఐడీ కార్డులపై బహిర్గతం చేయాల్సిన అవసరం ఏముందని నిలదీస్తున్నారు. ఈ వివాదంపై భిన్న కోణాలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల ఫలాలను వేగంగా చేరవేయడానికి డిజిటల్ రికార్డుల్లో ఈ సమాచారం ఉపయోగపడుతుందని కొందరు వాదిస్తుండగా, దానికి ఐడీ కార్డులే సాధనం కానవసరం లేదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక విద్యావ్యవస్థ విద్యార్థుల్లో సమానత్వాన్ని పెంచాలి కానీ, ఇలాంటి నిర్ణయాల వల్ల వారి మనసుల్లో కుల వ్యవస్థ పట్ల లేనిపోని ఆలోచనలు నాటకూడదని విశ్లేషకులు సూచిస్తున్నారు. తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది