సుకుమార్ మార్క్ పడింది.. ఇక రావు బహదూర్ కి తిరుగు లేదు
Actor ProfileActor

సుకుమార్ మార్క్ పడింది.. ఇక రావు బహదూర్ కి తిరుగు లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సుకుమార్ మార్క్ పడింది.. ఇక రావు బహదూర్ కి తిరుగు లేదు
Chitrajyothy8 Aug 2026
సుకుమార్ మార్క్ పడింది.. ఇక రావు బహదూర్ కి తిరుగు లేదు

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రావు బహదూర్ (Rao Bahadur). వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రావు బహదూర్ (Rao Bahadur). సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ (GMB Entertainment) సమర్పణలో, ఎ+ఎస్ మూవీస్ (A+S Movies) మరియు శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (SriChakraas Entertainments) బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌కు స్పెషల్ స్క్రీనింగ్ లో సినిమా చూపించారు. సినిమా చూసిన సుకుమార్ పూర్తిగా ఆశ్చర్యపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ టీమ్‌ను గట్టిగా హగ్ చేసుకొని అభినందించాడు. సత్యదేవ్ లాంటి అద్భుతమైన నటుడికి ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సుక్కు ఈ సందర్భంగా ప్రశంసించాడు. రావు బహదూర్ లాంటి ఒక విభిన్నమైన జోనర్ సినిమా ఇప్పటివరకు టాలీవుడ్‌లోనే కాదు, అసలు ఇండియన్ స్క్రీన్ పైనే రాలేదని తెలిపాడు. సినిమా చూశాక పరిశ్రమలోని ప్రతి ఆర్టిస్ట్ ఖచ్చితంగా జెలస్ ఫీల్ అవుతారని, ఎందుకంటే ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలు చేసే అవకాశం అందరికీ రాదని సత్యదేవ్ అద్భుత నటనను మెచ్చుకున్నాడు. దర్శకుడు వెంకటేష్ మహా దాదాపు 8 ఏళ్ల పాటు ఎంతో ఓపికగా కష్టపడి ఈ విజువల్స్, కాస్ట్యూమ్స్, ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడని, సినిమాపై విపరీతమైన ప్రేమ, పిచ్చి ఉంటే తప్ప ఇలాంటి ప్రాజెక్ట్‌ను నమ్మి ప్రొడ్యూస్ చేయడం