
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో యువకుడు సాయికృష్ణ కస్టడీలో మృతి చెందడం, అనంతరం మృతదేహాన్ని మాయం చేసిన కేసులో మాజీ సీఐ సూడా సురేష్ వీర వెంకట నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు నమోదయ్యాయి. రిమాండ్ రిపోర్టు ప్రకారం.. సాయికృష్ణపై కృష్ణలంక, మాచర్ల పోలీస్ స్టేషన్లలో నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2026 మే మొదటి వారంలో మార్కాపురం వద్ద అతడిని అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మే 6న తెల్లవారుజామున సీఐ నాగరాజు సాయికృష్ణను తన కస్టడీలోకి తీసుకున్నారు. చట్టప్రకారం 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ, అక్రమంగా లాకప్‌లోనే ఉంచినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాయికృష్ణను పోలీసులు పట్టుకున్న విషయం తెలుసుకుని అతని తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, గాయాలతో లాకప్‌లో ఉన్న తన కుమారుడిని చూసినట్లు, లోపల నుంచి కేకలు వినిపించినట్లు ఆమె వాంగ్మూలంలో నమోదు చేశారు. కుమారుడిని విడిచిపెట్టాలని వేడుకున్నా సీఐ నాగరాజు ఆమెను దూషించి, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. స్పృహ లేని స్థితిలో ఉన్న సాయికృష్ణ కాళ్లకు తాడు కట్టి స్టేషన్‌లోనే హింసించినట్లు దర్యాప్తులో నమోదు చేశారు. ఈ హింస కారణంగానే మే 6 నుంచి మే 8 మధ్యకాలంలో సాయికృష్ణ పోలీస్ కస్టడీలో మృతి చెందినట్లు ప్రాథమిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కస్టడీలో మరణం అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ నుంచి రహస్యంగా తరలించి, ఆధారాలు లభించకుండా తగులబెట్టి పూర్తిగా మాయం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు. ఇప్పటివరకు సాయికృష్ణ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలను చెరిపివేసే ప్రయత్నంలో భాగంగా పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా తొలగించినట్లు రిపోర్టులో వెల్లడైంది. మే 1