సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్ధం
Actor ProfilePolitician

సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్ధం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్ధం
Andhra Jyothy22 Jun 2026
సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్ధం

సస్పెన్షన్ వేటు పడిన కృష్ణ లంక సీఐ నాగరాజును ఆదివారం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయనే ప్రచారం సాగుతోంది. విజయవాడ, జూన్ 21: సస్పెన్షన్ వేటు పడిన కృష్ణ లంక సీఐ నాగరాజును ఆదివారం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయనే ప్రచారం సాగుతోంది. సాయికృష్ణ నిర్బంధం, హత్యాయత్నం కింద సీఐ నాగరాజుపై ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆదివారం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు కృష్ణ లంక పోలీస్టేషన్‌లో స్టేషన్ సిబ్బందితోపాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను ఏసీపీ దైవ ప్రసాద్ బృందం విచారించింది. సాయి కృష్ణ లాకప్ డెత్.. దహనం చేశారంటూ అతడి తల్లి విజయలక్ష్మీ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కృష్ణ లంకలోని స్వర్గపురి శ్మశానవాటికలో సిబ్బంది నుంచి పటమట సీఐ పవన్ కిషోర్ వివరాలు సేకరించారు. ఆ క్రమంలో మే 23 నుంచి 25వ తేదీ వరకు అనాథ మృతదేహాలకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. అదే సమయంలో బస్టాండు నుంచి స్వర్గపురి వరకు ఉన్న సీసీ టీవీ కెమెరాలను కూడా గుణదల సీఐ పరిశీలించారు. ఇంకో వైపు ఇదే కేసులో క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ విచారణ ఆధారంగా ఏసీపీ దైవ ప్రసాద్ బృందం సాక్ష్యాలను సేకరిస్తోంది. అలాగే సీఐ నాగరాజుతో ‌పాటు ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు. శనివారం టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారిని మరోసారి విచారణకు పిలిచి స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు