సీఏలకు భలే డిమాండ్ గురూ
Actor ProfilePolitician

సీఏలకు భలే డిమాండ్ గురూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఏలకు భలే డిమాండ్ గురూ
Andhra Jyothy27 Aug 2026
సీఏలకు భలే డిమాండ్ గురూ

సమాజంలో వారి పాత్ర కీలకం ఆర్థిక పారదర్శకతకు వారధులు ఉమ్మడి వరంగల్‌లో 200 మంది సీఏలు రిజిస్ట్రేషన్‌ నేడు చార్టెడ్‌ అక్కౌంట్స్‌ డే హనుమకొండ: సమాజంలో చార్టెట్‌ అకౌంట్స్‌ (సీఏ) పాత్ర కీలకమైనది. వారు కేవలం లెక్కలు చేసే వ్యక్తులు మాత్రమే కాదు. వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తులు ఆర్థికంగా సరైన నిర్ణయాలు తీసుకునేలా మార్గనిర్దేశం చేస్తారు. సంస్థల ఆర్థిక లెక్కలను పరిశీలించి (ఆడిట్‌ చేసి) అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారిస్తారు. ఆదాయ పన్ను, జీఎస్టీ వంటి పన్నుల విషయంలో చట్టబద్ధమైన సలహాలు అందించి, పన్ను నిబంధనలు పాటించడంలో సహాయపడతారు. కొత్త వ్యాపారాల ప్రారంభం, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ వంటి అంశాల్లో మార్గదర్శనం చేస్తారు. ఆర్థిక అక్రమాలు, మోసాలను గుర్తించి, సంస్థల్లో జవాబుదారీతనం, విశ్వసనీయతను పెంచడంలో సహాయపడతారు. పరిశ్రమలు, కంపెనీలు సమర్థవంతంగా పని చేయడానికి దోహదపడతారు. పెట్టుబడిదారులు, బ్యాంకులు, ఇతర భాగస్వాములు సంస్థల ఆర్థిక నివేదికలను సమ్మడానికి చార్టెడ్‌ అకౌంటెంట్ల పని కీలకం. నేడు చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ దినం. మెండుగా ఉపాధి అవకాశాలు ప్రస్తుతం దేశంలో సీఏలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారాల పెరుగుదల, పన్ను నిబంధనల్లో మార్పులు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విస్తరణ వల్ల నైపుణ్యం కలిగిన సీఏలకు నిరంతరం డిమాండ్‌ ఉంది. ప్రైవేట్‌ కంపెనీలు, ఆడిట్‌ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ సంస్థలు, స్టార్ట్‌పలు, బహుళజాతి కంపెనీల్లో ఉపాధి అవకాశాలున్నాయి. స్వతంత్రంగా సీఏ ప్రాక్టీస్‌ ప్రారంభించవచ్చు. నైపుణ్యం, అనుభవం, పని చేసే నగరం ఆధారంగా వేతనాలు మారుతాయి. సాధారణంగా కొత్తగా అర్హత పొందిన సీఏలకు సంవత్సరానికి రూ.8 నుంచి రూ. 15 లక్షల ప్యాకేజీ లభించవచ్చు. మంచి అనుభవం ఉన్న సీఏలు రూ. 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక వేతనం పొందే అవకాశాలు ఉన్నాయి. సీఏ కావడానికి చేయూత వరంగల్‌ పోచమ్మమైదాన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంట్స్‌