సీఎం విజయ్ చివరి సినిమాకు సెన్సార్ క్లియరెన్స్! 'జన నాయగన్ రిలీజ్ ఎప్పుడంటే
Actor ProfilePolitician

సీఎం విజయ్ చివరి సినిమాకు సెన్సార్ క్లియరెన్స్! 'జన నాయగన్ రిలీజ్ ఎప్పుడంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఎం విజయ్ చివరి సినిమాకు సెన్సార్ క్లియరెన్స్! 'జన నాయగన్ రిలీజ్ ఎప్పుడంటే
TV9 Telugu4 Sept 2026
సీఎం విజయ్ చివరి సినిమాకు సెన్సార్ క్లియరెన్స్! 'జన నాయగన్ రిలీజ్ ఎప్పుడంటే

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే దలపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలై ఆరు నెలలు అయ్యేది. మొదట ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ఇప్పటివరకు చిత్ర బృందం ఇంకా అధికారిక ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ బాగా నిరాశలో ఉన్నారు. దీనికి తోడు ఈ సినిమా గురించి అధికారిక సమాచారం లేకపోవడంతో, సోషల్ మీడియాలో కొత్త పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అంతకుముందు, విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా జూన్‌లో విడుదల అవుతుందని చెప్పారు. అయితే, అలా జరగలేదు. ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం జన నాయగన్ చిత్రానికి సెన్సార్ పూర్తయిందని వార్తలు వస్తున్నాయి. విజయ్ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'ఎ' సర్టిఫికేట్ లభించిందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా జూలై మధ్యలో విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం జననాయగన్ చిత్రం ఆగస్టు 7న విడుదలయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. కాగా ఈ సినిమా పైరసీ ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దీంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ వార్తలకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లభించలేదు. ఈ చిత్రం జూన్‌లో విడుదలవుతుందన్న మునుపటి వార్తలు కూడా అవాస్తవమే. ఈ గందరగోళాన్ని తొలగించేందుకు, నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ త్వరలోనే అధికారిక తేదీని ప్రకటించే అవకాశం ఉంది. హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. #ThalapathyVijay's first "A" Certified film was #Bagavathi