సీఎం విజయ్ కి ప్రశంసల వెల్లువ.. అక్కడ అలా..ఇక్కడ ఇలా
Actor ProfilePolitician

సీఎం విజయ్ కి ప్రశంసల వెల్లువ.. అక్కడ అలా..ఇక్కడ ఇలా

Total News1
Movie Updates0
Sources1
సీఎం విజయ్ కి ప్రశంసల వెల్లువ.. అక్కడ అలా..ఇక్కడ ఇలా
Oneindia Telugu13 Jun 2026
సీఎం విజయ్ కి ప్రశంసల వెల్లువ.. అక్కడ అలా..ఇక్కడ ఇలా

తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కోలీవుడ్ స్టార్ విజయ్ తనదైన శైలిలో ప్రజలను, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. పరిపాలన చేపట్టిన కొద్ది రోజులకే సాధారణ రాజకీయ నాయకులకు భిన్నమైన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన కర్ణాటకలోని ప్రముఖ కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం, అనంతరం దాదాపు 130 కిలోమీటర్ల మేర తన కారును స్వయంగా నడుపుకుంటూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.మూకాంబిక అమ్మవారికి వెండి ఖడ్గం కానుకకర్ణాటకలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబిక ఆలయానికి చేరుకున్న సీఎం విజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుమారు 1.6 కేజీల బరువున్న భారీ వెండి ఖడ్గాన్ని కానుకగా సమర్పించారు. అలాగే పట్టుచీర, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు.డ్రైవింగ్ సీట్లో సీఎం విజయ్.. అభిమానుల ప్రశంసలుదర్శనం అనంతరం అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన కాన్వాయ్‌లోని కారులో డ్రైవింగ్ సీట్లో స్వయంగా కూర్చున్న విజయ్, కొల్లూరు నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు దాదాపు 130 కిలోమీటర్ల ప్రయాణాన్ని తానే డ్రైవ్ చేశారు. దారిలోని ఒక టోల్ ప్లాజా వద్ద అభిమానులు ఆయనను గుర్తించి కేకలు వేయగా, విజయ్ స్టీరింగ్ పట్టుకునే చిరునవ్వుతో చేతులూపి అభిమానులను పలకరించారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింప్లిసిటీకి మరో పేరు విజయ్, ముఖ్యమంత్రి అయినా స్టార్‌డమ్ మార్చలేదు, ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక సెంటిమెంట్కొల్లూరు మూకాంబిక ఆలయానికి తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఈ ఆలయాన్ని సందర్శించిన మూడో తమిళనాడు సీఎం విజయ్ మాత్రమే కావడం విశేషం. గతంలో దిగ్గజ నాయకులు ఎం.జి.