
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pawan kalyan inaugurates new janasena party office in Manikonda Hyderabad: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన చాణక్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ తన సభకు అనుమతివ్వలేదని తన నివాసంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా రచ్చగా మారాయి. అంతే కాకుండా బరాబర్ తెలంగాణలో జరిగే అన్ని ఎన్నికలలో బరిలో ఉంటామని , ఇక్కడి ప్రజల కోసం ప్రశ్నిస్తామని చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీ నుంచి ఇక్కడి వ్యక్తులే బరిలో ఉంటారని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా తెలంగాణలో జనసేన ను బలోపేతం దిశగా వ్యూహత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల వరంగల్ లో నిరంజన్ ను పరామర్శించిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గొప్ప మనసు పట్ల జనాలు ఫిదా అవుతున్నారు. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విస్తరణలో మరో కీలక ముందడుగు వేశారు. హైదరాబాద్ లోని మణికొండలో జనసేన పార్టీనూతన ఆఫీస్ ను ప్రారంభించారు. దీనికి తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తలు, నేతలు హజరయ్యారు. ముఖ్యంగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బరిలో నిలిచి, గెలవడమే టార్గెట్ గా పవన్ కళ్యాణ్ వ్యూహత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి, తెలంగాణ రాష్ట్ర జనసేన నూతన కార్యాలయంలో జనసేన జెండాను