సీఎంను డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం
Actor ProfilePolitician

సీఎంను డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం

Total News1
Movie Updates0
Sources1
సీఎంను డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం
Chitrajyothy16 Jun 2026
సీఎంను డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం

సీఎం విజయ్‌కు నటుడు, దర్శకనిర్మాత విశాల్‌ శుభాకాంక్షలు తెలియచేశారు. సీఎం విజయ్‌ పేరుతో ముగ్గురు బాలికల చదువు కోసం తాను సాయం చేయబోతున్నట్టు విశాల్‌ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ బాధ్యతలు స్వీకరించి, నెల రోజులు గడిచిపోయినా... సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూనే ఉన్నారు. గతంలో తమ సహచరుడిగా ఉన్న విజయ్‌ (Vijay) ఇప్పుడు రాష్ట్రాధినేత కావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కొందరు సినిమా రంగంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళుతుంటే, మరికొందరు తమ కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాయి. అయితే... నటుడు, నిర్మాత, తాజాగా దర్శకుడిగానూ మారిన విశాల్‌ (Vishal) మాత్రం తనదైన రీతిలో సీఎం విజయ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపాడు. విశేషం ఏమంటే... సీఎంను కలవడానికి పుష్పగుచ్ఛం, శాలువా అలాంటివి తీసుకెళ్ళకుండా... తనలోని సేవా భావాన్ని విశాల్‌ చాటుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. విజయ్‌తో ఉన్న అనుబంధాన్ని ఓ ఫ్యాన్ బోయ్‌గా విశాల్ పంచుకోవడం విశేషం. తన సోషల్ మీడియా పోస్ట్ లో విశాల్‌ ఈ విధంగా పేర్కొన్నాడు. 'ప్రియమైన డార్లింగ్ సీఎం విజయ్ గారికి, నేను మిమ్మల్ని ఎన్నో ఏళ్లుగా 'డార్లింగ్‌' అనే సంభోదిస్తున్నాను. లయోలా కళాశాల రోజుల నుంచి, మీతో పరిచయం ఏర్పడినప్పటి నుంచి ఆ పదం మారలేదు. అప్పట్లో ఎదుగుతున్న నటుడిగా మీ గురించి తెలుసుకున్నాను. ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లను, విమర్శలను తట్టుకుని మీరు సూపర్‌స్టార్‌గా ఎదిగిన వైనాన్ని చూశాను. ఇప్పుడు మీరు తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. ఇవాళ మీ హోదా, పదవి మారి ఉండొచ్చు. కానీ మీరు ఏమాత్రం మారలేదు. మిమ్మల్ని కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అదే ఆప్యాయత, అదే స్నేహపూర్వకతను మరోసారి అనుభవించాను. కళైంజర్ అయ్యా నుంచి జయలలిత అమ్మ వరకు, స్టాలిన్ అంకుల్ నుంచి నా ఆప్తుడు ఉదయ వరకు... మన రాష్ట్ర