షబ్బీర్ అలీకి నోటీసులు ఇచ్చాం
Actor ProfilePolitician

షబ్బీర్ అలీకి నోటీసులు ఇచ్చాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
షబ్బీర్ అలీకి నోటీసులు ఇచ్చాం
AP7AM18 Jun 2026
షబ్బీర్ అలీకి నోటీసులు ఇచ్చాం

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు రచ్చకెక్కడంతో అధిష్ఠానం సీరియస్ అయింది. ఎంతటి వారైనా సరే తమ వ్యక్తిగత సమస్యలను తెచ్చి పార్టీపై రుద్దవద్దని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి హెచ్చరికలు జారీ చేశారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డిల అంశంపై స్పందించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి నోటీసులు జారీ చేశామని, ఆయన ఆదివారం కమిటీ ముందు హాజరవుతారని మల్లు రవి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు. నేతలకు ఏమైనా సమస్యలు ఉంటే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లేదా రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లాలే తప్ప క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే మల్లు రవిని కలిసి నోటీసులపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు