.webp)
షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎల్లప్పుడూ లాభాలే వస్తాయని చెప్పలేము. కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో ఊహించని విధంగా భారీగా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై నష్టాలు వచ్చినప్పుడు, చాలా మంది పెట్టుబడిదారులు ఒక సాధారణ పొరపాటు చేస్తారు. ఈ ఏడాది మనకు ఎలాగో లాభాలు రాలేదు కదా, ఇక ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారు. ముఖ్యంగా వారి మొత్తం వార్షిక ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు ఐటీఆర్ ఫైలింగ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. కానీ, పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం, నష్టాలు వచ్చిన సంవత్సరంలో ఐటీఆర్ దాఖలు చేయకపోవడం వల్ల భవిష్యత్తులో భారీగా పన్ను ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ఆర్థిక సంవత్సరంలో షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా సంభవించిన నష్టాలను (Capital Losses) భవిష్యత్తు సంవత్సరాల్లో వచ్చే లాభాలతో అడ్జస్ట్ (Set-off) చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. అయితే, ఈ నష్టాలను ముందస్తుగా ముందుకు తీసుకెళ్లాలన్నా (Carry Forward), లేదా భవిష్యత్తు లాభాలతో మినహాయింపు పొందాలన్నా ప్రభుత్వం ఒక కఠినమైన నిబంధనను విధించింది. పెట్టుబడిదారులు తమ ఆదాయపు పన్ను రిటర్నులను నిర్ణీత గడువు తేదీలోగా తప్పనిసరిగా దాఖలు చేయాలి. గడువు ముగిసిన తర్వాత దాఖలు చేసే రిటర్నుల ద్వారా ఈ నష్టాలను ముందుకు తీసుకెళ్లే హక్కును ఇన్వెస్టర్లు పూర్తిగా కోల్పోతారు. దీనిని ఒక స్పష్టమైన ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడికి 2026 ఆర్థిక సంవత్సరంలో షేర్ల విక్రయం ద్వారా రూ. 2 లక్షల మూలధన నష్టం (Capital Loss) వచ్చింది అనుకుందాం. ఒకవేళ ఆ ఇన్వెస్టర్ నిర్ణీత గడువులోగా తన ఐటీఆర్ దాఖలు చేయకపోతే, ఆ రూ. 2