షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్
Actor ProfileActor

షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్
AP7AM21 Jun 2026
షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్

షేర్ మార్కెట్ వ్యామోహం, ఆప్షన్స్ ట్రేడింగ్‌లో వచ్చిన భారీ నష్టాలు ఒక సాధారణ అకౌంటెంట్‌ను నేరస్తుడిగా మార్చాయి. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన 36 ఏళ్ల జిగ్నేష్ లాల్జీభాయ్ తలావియా అనే అకౌంటెంట్, తన అప్పులను తీర్చుకోవడానికి ఏకంగా తన సొంత కిడ్నాప్ డ్రామాను సృష్టించి కుటుంబ సభ్యుల నుంచి రూ. 50 లక్షలు వసూలు చేయాలని చూశాడు. సూరత్‌లోని మోటా వరాఛా ప్రాంతంలో నివసించే జిగ్నేష్ జూన్ 12న అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో, అతడి భార్య మీనాక్షిబెన్ తలావియా ఉత్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె మొబైల్‌కు కొన్ని గుర్తుతెలియని నంబర్ల నుంచి బెదిరింపు సందేశాలు వచ్చాయి. జిగ్నేష్‌ను తాము కిడ్నాప్ చేశామని, రూ. 50 లక్షల నగదు ఇవ్వకపోతే చంపేస్తామని, పోలీసులకు చెబితే శవాన్ని పంపుతామని ఆ మెసేజ్‌లలో పేర్కొన్నారు. దీనికి తోడు జిగ్నేష్ చేతులు, కాళ్లు కట్టేసి ఉండి, తీవ్రమైన భయాందోళనలతో ఉన్నట్లు నటిస్తున్న కొన్ని వీడియోలు కూడా భార్యకు పంపడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.ఈ ఉదంతాన్ని అత్యంత తీవ్రమైన కిడ్నాప్ కేసుగా పరిగణించిన సూరత్ డీసీపీ జాలా నేతృత్వంలోని ఉత్రాన్ పోలీసులు, లోకల్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగాయి. నిందితుల కదలికలను కనిపెట్టేందుకు సాంకేతిక నిఘా, మొబైల్ టవర్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆ కిడ్నాప్ వీడియోలు, మెసేజ్‌లు గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లా గోద్రా పట్టణం నుంచి వస్తున్నట్లు ఐటీ సెల్ గుర్తించింది. జూన్ 15న మధ్యాహ్నం