షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సంగీత్ శోభన్.. దర్శకుడెవరంటే
Actor ProfileActor

షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సంగీత్ శోభన్.. దర్శకుడెవరంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సంగీత్ శోభన్.. దర్శకుడెవరంటే
Chitrajyothy14 Jul 2026
షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సంగీత్ శోభన్.. దర్శకుడెవరంటే

‘మ్యాడ్’ సిరీస్ చిత్రాలతో పాటు రీసెంట్‌గా నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాస’ మూవీతోనూ సంచలన విజయాన్ని అందుకున్న సంగీత్ శోభన్‌కు.. ఇప్పుడో టాప్ బ్యానర్‌లో అవకాశం వరించింది. సంగీత్ శోభన్ (Sangeeth Shoban).. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఇటీవల వరుస సక్సెస్‌‌లతో దూసుకెళుతోన్న హీరోలలో సంగీత్ శోభన్ కూడా ఒకరు. ‘మ్యాడ్’ (Mad) సిరీస్ చిత్రాలతో పాటు రీసెంట్‌గా నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాస’ (Rakasa) తోనూ సంచలన విజయాన్ని అందుకున్న సంగీత్ శోభన్‌కు.. ఇప్పుడో టాప్ బ్యానర్‌లో అవకాశం వరించింది. మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వర ప్రసాద్ గారు’, నటసింహం బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ (Shine Screens banner)లో సంగీత్ శోభన్ హీరోగా.. నిర్మాత సాహు గారపాటి ఇప్పుడో యాక్షన్ కామెడీ చిత్రాన్ని నిర్మింబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు దర్శకుడెవరంటే.. ‘సాహో’ దర్శకుడు సుజీత్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రణయ్ రావు (Pranay Rao) ఈ చిత్రంతో దర్శకుడికి ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ‘మ్యాడ్’ చిత్రానికి ప్రణయ్ రావు రైటర్‌గా కూడా పని చేశారు. ఇప్పుడాయన రెడీ చేసిన స్క్రిప్ట్ నచ్చడంతో.. సాహు గారపాటి ఈ సినిమా నిర్మించేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాలో.. సంగీత్ శోభన్ పాత్ర సరికొత్తగా ఉంటుందని, కచ్చితంగా మరో సక్సెస్ ఆయన ఖాతాలో పడుతుందనేలా అప్పుడే టాక్ మొదలైంది. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ విషయానికి వస్తే.. ఈ బ్యానర్ పట్టిందల్లా బంగారం అవుతోంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో హిట్ మెషీన్ అనిల్