శక్తివంతమైన శనిత్రయోదశి... రేపు శని దోషాల నివారణకు ఏంచేయాలంటే
Actor ProfilePolitician

శక్తివంతమైన శనిత్రయోదశి... రేపు శని దోషాల నివారణకు ఏంచేయాలంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శక్తివంతమైన శనిత్రయోదశి... రేపు శని దోషాల నివారణకు ఏంచేయాలంటే
Zee Telugu26 Jul 2026
శక్తివంతమైన శనిత్రయోదశి... రేపు శని దోషాల నివారణకు ఏంచేయాలంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Shani trayodashi shani puja and remedies: జ్యోతిష్య పండితుల ప్రకారం శనిదేవుడు కర్మప్రభువు. నవగ్రహాలలో చాలా శక్తివంతమైన గ్రహం. సూర్యుడు,ఛాయాదేవీల కుమారుడు. చాలా మంది జీవితాల్లో శనిదేవుడు తన ప్రభావంను చూపిస్తాడు. వారు చేసుకున్న కర్మలను బట్టి ఫలితాల్ని ఇస్తాడు. తరచుగా మనం శని సాడేసాతి, అష్టమ, అర్దాష్టమ వంటి దోషాల్ని వింటుఉంటాం. ఈ దోషాల నివారణకు శనిభగవానుడ్ని ప్రత్యేకంగా ప్రసన్నం చేసుకుని పూజించుకొవాలి.ఈ సారి మనకు శనివారంతో పాటు త్రయోదశి తిథి కూడా కలిసి రావడంతో అత్యంత శ్రేష్టమైందని చెబుతారు. మనం శనిత్రయోదశిని ఈసారి జూన్ 27న జరుపుకుంటాం. శనిపీడ ప్రభావంతో బాధలు పడుతున్న వారు శనివారం రోజున నవగ్రహాలు ఉన్న ఆలయంకు వెళ్లాలి. అక్కడ నల్లని నువ్వుల నూనె లేదా ఆముదపు నూనెలతో శని విగ్రహాలకు పండితులు చెప్పిన దాని ప్రకారం అభిషేకం చేయాలి. నల్లని వస్త్రం, నల్లని నువ్వులు, దొడ్డు ఉప్పు శని దేవుడికి సమర్పించుకొవాలి. శనీశ్వరుడి అనుగ్రహం కోసం రావి చెట్టు నీడలో నెయ్యి దీపం వెలిగించాలి. నల్లని శునకంకు చపాతీలు పెట్టాలి. ఆవులకు ఏదైన గ్రాసం తినిపించాలి. ముఖ్యంగా నల్లని చీమలకు బెల్లం,చక్కెరలను పెట్టాలి. శనిదేవుడి వాహనం అయిన కాకికి ఏదైన తీపి పదార్థం తినేందుకు పెట్టాలి. నల్లని వస్త్రాలను ధరించి శనీపూజలో పాల్గొనాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. ఈ విధంగా చేస్తే శనీదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.నదీస్నానం చేస్తే చాలా పుణ్యమని పండితులు చెబుతారు. ఇంకా వెంకటేశ్వర స్వామి, శివుడు, హనుమంతుడ్ని పూజించుకున్న శనీదోషాలు పోతాయంటారు. హనుమంతుడికి తమలపాకులు, వడమాలలను సమర్పించుకొవాలి