శ్రావణ మాసంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? ఈ టిప్స్ తో టికెట్లు ఈజీగా బుక్
Actor ProfileCelebrity

శ్రావణ మాసంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? ఈ టిప్స్ తో టికెట్లు ఈజీగా బుక్

Total News1
Movie Updates0
Sources1
శ్రావణ మాసంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? ఈ టిప్స్ తో టికెట్లు ఈజీగా బుక్
Samayam Telugu13 Jun 2026
శ్రావణ మాసంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? ఈ టిప్స్ తో టికెట్లు ఈజీగా బుక్

తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) వివరాల ప్రకారం, శ్రీవారి అర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలు, ఎలక్ట్రానిక్ డిప్, శ్రీవాణి ట్రస్టు, స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లకు సంబంధించి సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18 నుంచి జూన్ 24వ తేదీ వరకు వివిధ సమయాల్లో టికెట్లు విడుదల కానున్నాయి. శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్ కోసం టిటిడి అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. నకిలీ వెబ్‌సైట్లను, బ్రోకర్లను నమ్మొద్దని హెచ్చరించింది. టిటిడి విడుదల చేసే ఆయా సేవల టికెట్లను బుక్ చేసుకోవడానికి ముందే మీరు ఎటిఎమ్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా ఏదైనా యుపిఐ(ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్ ఇతరవాటిని) సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు(రేషన్ కార్డు, అధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) వంటివి అప్ లోడ్ చేయాలి. అలాగే లడ్డూ, వడ ప్రసాదం కావాలనుకునేవారు అక్కడే బుక్ చేసుకోవచ్చు. * ముందుగా గూగుల్ సైట్ ఓపెన్ చేసి అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. * ఒకవేళ స్మార్ట్‌ఫోన్ ద్వారా అయితే గోవిందా యాప్ నుంచి లాగిన్ అవ్వాలి. * హోమ్‌పేజీలో స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ల ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. * మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే, నేరుగా లాగిన్ కావొచ్చు. * ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే, కొత్త అకౌంట్ వెంటనే ఓపెన్ చేయొచ్చు. * అక్కడే మీ ఫోన్ నెంబర్ వివరాలను నింపి, ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేయాలి. * తర్వాత మీ ఫోనులో వచ్చిన ఓటీపిని ఎంటర్ చేస్తే, మీరు వెంటనే లాగిన్ అవుతారు. * లాగిన అయిన తర్వాత ఏయే తేదీల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి, ఏ టైమ్‌కి ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. * అందులో మీకు