శ్రీలీలకు అనుమానం.. ఆమెను పక్కకు జరగమన్న మహారాష్ట్ర సీఎం భార్య
Actor ProfilePolitician

శ్రీలీలకు అనుమానం.. ఆమెను పక్కకు జరగమన్న మహారాష్ట్ర సీఎం భార్య

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శ్రీలీలకు అనుమానం.. ఆమెను పక్కకు జరగమన్న మహారాష్ట్ర సీఎం భార్య
Zee Telugu28 Jun 2026
శ్రీలీలకు అనుమానం.. ఆమెను పక్కకు జరగమన్న మహారాష్ట్ర సీఎం భార్య

Sreeleela:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, ఆమె కుమార్తె దివిజాతో కలిసి శ్రీలీల ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముగ్గురూ కలిసి ఫోటోలు దిగేందుకు నిలబడగా, అక్కడ ఉన్న బాలీవుడ్ మీడియా ఫోటోగ్రాఫర్లు వరుసగా ఫోటోలు తీయడం ప్రారంభించారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఓ ఫోటోగ్రాఫర్ మరాఠీలో మాట్లాడుతూ, "మేడమ్... మీ ఇద్దరి ఫోటోలు మాత్రమే కావాలి" అని అమృతా ఫడ్నవీస్‌ను కోరినట్లు వీడియోలో వినిపిస్తోంది. దీంతో అమృతా ఫడ్నవీస్ శ్రీలీల వైపు తిరిగి, "మీరు కాసేపు అక్కడ కూర్చుంటారా?" అని అడిగినట్లు తెలుస్తోంది. వెంటనే శ్రీలీల ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ఆ తర్వాత అమృతా ఫడ్నవీస్, ఆమె కుమార్తె దివిజా కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చారు.ఫోటోలు పూర్తయిన తర్వాత అమృతా ఫడ్నవీస్ ఫోటోగ్రాఫర్లను చూసి "ఓకేనా? చాలానే తీసుకున్నారా?" అని అడిగినట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొంతమంది నెటిజన్లు శ్రీలీలను కావాలనే పక్కకు పంపించారని, ఇది ఆమెకు అవమానకరంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న శ్రీలీలకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని అంటున్నారు. మరోవైపు కొందరు మాత్రం అమృతా ఫడ్నవీస్‌ను సమర్థిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ ప్రత్యేకంగా తల్లి, కుమార్తె ఫోటోలు మాత్రమే కావాలని కోరడంతో ఆమె అలా చెప్పారని, ఇందులో ఎలాంటి అవమానించే ఉద్దేశం లేదని అభిప్రాయపడుతున్నారు. ఇక అమృతా ఫడ్నవీస్ ప్రముఖ బ్యాంకర్, గాయని. ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి. ప్రజా జీవితంలో ఉండటం వల్ల ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది.అయితే ఈ వైరల్ వీడియోపై ఇప్పటివరకు శ్రీలీల గానీ, అమృతా