శ్రీలంకలో.. 'డ్రాగన్' వేట
Actor ProfileActor

శ్రీలంకలో.. 'డ్రాగన్' వేట

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శ్రీలంకలో.. 'డ్రాగన్' వేట
Chitrajyothy19 Jun 2026
శ్రీలంకలో.. 'డ్రాగన్' వేట

యంగ్ టైగర్ యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న 'డ్రాగన్' అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది... ఈ మూవీలోని లూగర్ రోల్ ను 'ట్రిపుల్ ఆర్' భీమ్ పాత్రతో పోలుస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. ప్రస్తుతం 'డ్రాగన్'కు సంబంధించిన కీలక సన్నివేశాలను ఆర్.ఎఫ్.సి.లో చిత్రీకరిస్తున్నారు. యన్టీఆర్ తో పాటు ప్రధాన పాత్రధారులందరూ ఈ షూటింగ్ లో పాలు పంచుకుంటున్నారు. ఈ షెడ్యూల్ కాగానే 'డ్రాగన్' టీమ్ శ్రీలంకకు పయనం కానుందట. అక్కడ ఒళ్ళు గగుర్పొడిచేలా యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నారని విశేషంగా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ మూవీస్ లో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇందులో యన్టీఆర్ పోషిస్తోన్న 'లూగర్' రోల్ ను మరింత వైల్డ్ గా చూపించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు 'ట్రిపుల్ ఆర్'లో యన్టీఆర్ పోషించిన కొమురం భీముడు పాత్రను, లూగర్ రోల్ ను బేరీజు వేస్తున్నారు సినీజనం. 'ట్రిపుల్ ఆర్'లో తమ తెగకు చెందిన పసిపాపను బ్రిటిష్ వారు తీసుకుపోగా, ఆ అమ్మాయిని తిరిగి తీసుకు రావడానికి ఎంతకైనా తెగించే కొమురం భీముడు పాత్రలో నటించి అలరించారు యన్టీఆర్. అదే తీరున 'డ్రాగన్'లో 'ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ' పోటీదారులను మట్టుపెట్టే క్రమంలో లూగర్ ప్రత్యర్థుల ప్రాణాలను తీసేస్తారట. పాప కోసం సాహసం చేసే కొమురం భీమ్ రోల్, తన కంపెనీ కోసం పోరాడే లూగర్ పాత్ర ఒకటి ఎలా అవుతాయి అన్న సందేహం రావచ్చు. అయితే 'లూగర్' పాత్ర ఎందుకలా మారింది అన్నఅంశం కూడా హృదయాలను కదిలించేలా ఉంటుందని తెలుస్తోంది. అందువల్లే భీమ్, లూగర్ పాత్రలను కంపేర్ చేస్తున్నారు మూవీ లవర్స్. 'ట్రిపుల్ ఆర్'లో బ్రిటిష్ వారిమీదే పోరాటం చేసే యోధుడుగా కనిపించారు యన్టీఆర్. 'డ్రాగన్'లో బ్రిటిష్ వారు వదిలేసిన ఓ మాదకద్రవ్య వ్యాపారం కోసం 'గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ', 'ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ' ఆధిపత్య పోరు సాగిస్తూ ఉంటాయి