
ఇండస్ట్రీ.. ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించేవారు. పెళ్లి అయ్యకా.. పిల్లలు పుట్టాక మాత్రమే తల్లి, అత్త, అక్క పాత్రల్లో కనిపించేవారు. ఇండస్ట్రీ.. ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించేవారు. పెళ్లి అయ్యకా.. పిల్లలు పుట్టాక మాత్రమే తల్లి, అత్త, అక్క పాత్రల్లో కనిపించేవారు. ఎందుకంటే ముందే అలాంటి పాత్రల్లో కనిపిస్తే.. ఇక కెరీర్ మొత్తం అలాంటి పాత్రలే వస్తాయని భయపడేవారు. కానీ, జనరేషన్ మారింది.. ఇండస్ట్రీ కూడా మారుతూ వస్తోంది.. డైరెక్టర్లు సైతం వారిని గ్లామర్ డాల్స్ గా కాకుండా కథను మలుపు తిప్పే వెపన్స్ గా వాడుతున్నారు. అలానే హీరోయిన్లు కూడా మారుతున్నారు. కథను బట్టి ఎలాంటి పాత్రకు అయినా ఓకే చెప్పేస్తున్నారు. పెళ్లి కాకముందే సినిమాల్లో తల్లులుగా నటించి మెప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో ఐశ్వర్య రాజేష్.. నలుగురు పిల్లలకు తల్లిగా నటించి షాక్ ఇచ్చింది. తన వయస్సుకు మించిన పాత్ర అయినా కూడా ఆమె నటనతో సినిమా సక్సెస్ కి కారణం అయ్యింది. ఇక ఇప్పుడు ఆమెలానే మరో బ్యూటీ ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించనుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు.. శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. తెలుగులో తెలుసు కదా సినిమాతో అడుగుపెట్టినా.. దానికి ముందు హిట్ 2 సినిమా రిలీజ్ అవ్వడంతో టాలీవుడ్ లో మొదటి అడుగు హిట్ తోనే పెట్టింది. దీని తరువాత ఆచితూచి అడుగులు వేస్తోన్న ఈ భామ.. గురూజీ చేతిలో పడింది. విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) ల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదర్శ కుటుంబం. ప్రస్తుతం శరవేగంగా