
దివంగత తార.. స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందం, నటన, డ్యాన్స్ ప్రతీది ప్రత్యేకమే. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి.. సౌత్ లో తన సినీ ప్రయాణం మొదలు పెట్టి.. బాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేసింది. సమాన్యులతో పాటు సెలబ్రిటీలలో కూడా అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి.. 54 ఏళ్ల వయసులో అనమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూసింది. ఆమె లేకపోయినా.. ఆమె సినిమాలు, నవ్వు, నటన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సాధారణంగా హీరోయిన్ల అందాలను పువ్వులతో పోల్చుతుంటారు. కవులు వారి సొగసులను ప్రకృతితో పోల్చుతూ.. ఎన్నో కవిత్వాలు కూడా రాస్తుంటారు. టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు హీరోయిన్ల విషయంలో పూలు, పండ్లతో చేసిన ప్రయోగాలెన్నో. శ్రీదేవి అందాన్ని కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా వర్ణించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక తెలుగు నటుడు మాత్రం ఆమె అందాన్ని వంకాయ కూరతో పోల్చుతూ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ ఈవెంట్ లో వెల్లడించారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు దివంగత స్టార్ యాక్టర్ రావు గోపాలరావు. చిరంజీవి చాలా సినిమాల్లో రావుగోపాలరావు విలన్ గా అలరించాడు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. చాలా సినిమాల్లో కలిసి పనిచేయడం వల్ల ఇద్దరి మధ్య స్నేహంతో పాటు..సొంత వారమన్న భావన కూడా పెరిగింది. రావు గోపాలరావు ను చిరంజీవి మావయ్యగారు అని ప్రేమగా పిలిచేవారు. చిరుని అల్లుడు అని పిలిచేవారు రావుగోపాలరావు. ఇక షూటింగ్స్ టైమ్ లో ఇద్దరు కలిసి భోజనం చేసేవారు. ఆయన మరణం తరువాత రావు రమేష్ ఇండస్ట్రీలో తండ్రి పేరు నిలబెడుతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదరగొడుతున్నారు. రావు రమేష్ గురించి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి ఓ ఈవెంట్ లో రావుగోపాలరావు ను తలుచుకున్నారు. షూటింగ్స్ టైమ్ లో రావుగోపాల రావుకి ఇంటి నుంచి నాలుగైదు రకాల వంటలతో