శుభగడియలొచ్చాయ్
Actor ProfilePolitician

శుభగడియలొచ్చాయ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శుభగడియలొచ్చాయ్
Andhra Jyothy19 Jun 2026
శుభగడియలొచ్చాయ్

నేటి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు జూలై 15 నుంచి ఆషాఢం అధిక జ్యేష్ఠ మాసం ముగియడంతో మళ్లీ శుభగడియలు ప్రారం భమయ్యాయి. దీంతో శుక్రవారం నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు తదితర శుభకార్యాలు జరగనున్నాయి. ఈ క్రమంలో పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సందడి నెలకొంటోంది. శుభకార్యాలు చేసుకునేందుకు ప్రజలు ముహూర్తాలు పెట్టుకుని సిద్ధమవుతుండగా.. వాటిపై ఆధారపడిన వృత్తివర్గాలు వారు చేతినిండా పని దొరకనుండడంతో బిజీ అవనున్నారు. ధర్మవరం(అనంతపురం): పరాభవ నామ సంవత్సరంలో వచ్చిన అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు శుభమూహుర్తాలకు బ్రేక్‌ పడింది. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. దీంతో 36 రోజుల పాటు కల్యాణమండపాలు, ఫంక్షన్‌హాళ్లు, కేటరింగ్‌ నిర్వాహకులు, డెకరేషన్‌ నిర్వాహకులు, పూల వ్యాపారులు, పురోహితులు, ఫొటో గ్రాఫర్లు, బ్యాండ్‌మేళం వారికి ఉపాధిలేకుండా పోయింది. ఆషాఢ మాసంతో బ్రేక్‌.. జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 12వరకు ఆషాడ మాసం(శూన్యమాసం) ఉండటంతో మళ్లీ శుభముహుర్తాలకు విరామం రానుంది. ఆ తరువాత ఆగస్టు 16 నుంచి మళ్లీ వివాహాలు, ఇతర శుభకారాలకు అనుకూలమైన ముహూర్తాలు ప్రారంభమవుతాయి. నేటి నుంచి శుభముహూర్తాలు నిజ జ్యేష్ఠ మాసంలో శుక్రవారం నుంచి జూలై 10వ తేదీ వరకు వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయి. వేదపండితుల ప్రకారం ఈనెల 19, 20, 21, 24, 25, 26, 27, 28వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే జూలై 1, 2, 3, 4, 5, 8, 9వ తేదీ ల్లోనూ శుభకార్యాలు నిర్వహించవచ్చు. జోరందుకున్న బుకింగ్స్‌.. శుక్రవారం నుంచి శుభ ముహూర్తాలు ఉండడంతో కల్యాణమండపాలు, ఫంక్షన్‌ హాళ్లు, క్యాటరింగ్‌, డెకరేషన్‌ నిర్వాహకులు, పూల వ్యాపారులు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారులు ఇప్పటికే బుకింగ్స్‌తో బిజీగా మారారు. వివాహాల కోసం జాతకాలు చూపించుకునే వారి రాకతో పురోహితులు, జ్యోతిష్య పండితులు కూడా తీరిక లేకుండా