వరల్డ్ వైడ్ పెద్ది’ 2 రోజుల మాస్ బ్యాటింగ్.. డబుల్ సెంచరీకి దగ్గరగా
Actor ProfileActor

వరల్డ్ వైడ్ పెద్ది’ 2 రోజుల మాస్ బ్యాటింగ్.. డబుల్ సెంచరీకి దగ్గరగా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వరల్డ్ వైడ్ పెద్ది’ 2 రోజుల మాస్ బ్యాటింగ్.. డబుల్ సెంచరీకి దగ్గరగా
123Telugu Movies14 Aug 2026
వరల్డ్ వైడ్ పెద్ది’ 2 రోజుల మాస్ బ్యాటింగ్.. డబుల్ సెంచరీకి దగ్గరగా

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర తన దెబ్బ రుచి చూపిస్తున్నాడు. తన అవైటెడ్ సినిమా పెద్ది చిత్రం గ్రాండ్ గా విడుదల అయ్యి సాలిడ్ వసూళ్లు రాబడుతుంది. వర్కింగ్ డేస్ లోనే వచ్చినప్పటికీ ఈ సినిమా ఊహించని నంబర్స్ ఈ రెండు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రాబట్టడం విశేషం. ఇలా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 130 కోట్లకి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు అది కూడా వర్కింగ్ డే లో మరో భారీ నెంబర్ సెట్ చేసింది. ఈ డే 2 కి మరో 50 కోట్ల గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి మొత్తం రెండు రోజుల్లో ఈ సినిమా 181.8 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. సో ఈ మూడు రోజుల్లో పెద్ది గాడు డబుల్ సెంచరీ కొట్టేయడం ఖాయం అయ్యిపోయింది. సో మొత్తానికి పెద్ది గాడి మాస్ బ్యాటింగ్ అటు సినిమాలోనే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కూడా ఓ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, జాన్వీ కపూర్ తదితరులు నటించగా రెహమాన్ సంగీతం అందించారు. అలాగే సతీష్ కిలారు నిర్మాణం వహించారు