వర్షమొస్తే అధికారులంతా రోడ్ల
Actor ProfilePolitician

వర్షమొస్తే అధికారులంతా రోడ్ల

Total News1
Movie Updates0
Sources1
వర్షమొస్తే అధికారులంతా రోడ్లపై ఉండాల్సిందే.. అవసరమైతే నేనూ వస్తా
Eenadu14 Jun 2026
వర్షమొస్తే అధికారులంతా రోడ్లపై ఉండాల్సిందే.. అవసరమైతే నేనూ వస్తా

హైదరాబాద్‌: వర్షాల సమయంలో హైదరాబాద్‌లో మున్సిపల్‌, పోలీసు సిబ్బంది మధ్య సమన్వయం కొరవడిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అసహనం వ్యక్తం చేశారు. వర్షాలు, ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ మాన్యువల్‌ ప్రకారం జరగాలని.. సీఈలు, ఎస్‌ఈలు స్థానికంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ, గేట్ల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ‘‘జూన్‌ 1న నిర్వహించిన సమీక్షలో వర్షాలపై ముందస్తు సూచనలు చేశాను. 9న వర్షం పడినప్పుడు అధికారులు సరిగా పనిచేయలేదు. హైదరాబాద్‌లో మున్సిపల్‌, పోలీసు సిబ్బంది మధ్య సమన్వయం లేదు. నీరు నిలిచే ప్రాంతాలు, బ్లాక్‌స్పాట్ల డేటా ఆధారంగా పనిచేయాలి. విద్యుత్‌శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఫీల్డ్‌లో ఉండని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వర్షమొస్తే ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపై ఉండాల్సిందే. అవసరమైతే నేనూ వస్తా. వర్షంతో నీరు నిలిచి ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడితే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్‌ విభాగంలో తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలి’’ అని సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వచ్చే నెల నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు?