వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే రోజూ ఇవి తినాల్సిందే
Actor ProfilePolitician

వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే రోజూ ఇవి తినాల్సిందే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే రోజూ ఇవి తినాల్సిందే
Zee Telugu26 Jul 2026
వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే రోజూ ఇవి తినాల్సిందే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Food To Boost Immunity In Monsoon: కొన్ని రోజులుగా మనం తీవ్రమైన వేడిని అనుభవిస్తున్నాం. ఇప్పుడు వర్షాలు పడటం వల్ల కొంచెం ఉపశమనం లభిస్తోంది. వర్షాల వల్ల నీటి కొరత తగ్గుతుంది. పంటలు పండుతాయి. కానీ, వర్షాకాలం రాగానే అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. నీటి నిల్వలు, అపరిశుభ్రత కారణంగా ఈగలు, దోమలు పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు కూడా వేగంగా వ్యాపిస్తాయి. అందుకే, బయట దొరికే ఆహారం తినకుండా, ఇంట్లోనే వండుకున్న వేడివేడి పదార్థాలనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, వ్యాధులను ఎదుర్కోవడానికి మీ ఇమ్యూనిటీతో పాటు జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వర్షాకాలంలో వ్యాధులు సోకినప్పుడు అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, పేగు ఆరోగ్యం బాగుంటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం తాగే నీరు ఎప్పుడూ వేడి చేసి తీసుకోవాలి. ప్రతిసారీ చేతులు శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్లు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వర్షాకాలంలో మీ డైట్‌లో చేర్చుకోవాల్సిన ఆహారాలు... ఈ సీజన్‌లో మార్కెట్లో యాపిల్స్, పియర్స్, దానిమ్మ, ప్లంస్, జామున్ వంటి పండ్లు సమృద్ధిగా దొరుకుతాయి. వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు బాగా పండుతాయి. వీటిని మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇమ్యూనిటీ వ్యవస్థ మెరుగుపడుతుంది. పేగు ఆరోగ్యం బాగుంటుంది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉన్న ఆహారాలపై దృష్టి పెట్టండి. వర్షాకాలంలో గోరువెచ్చని సూప్స్ తాగడం చాలా మంచిది. ఉడికించిన కూరగాయలు, చికెన్ లేదా పప్పులతో చేసిన సూప్‌లు తీసుకోవడం వల్ల