వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్
Actor ProfilePolitician

వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గింపు.. అతిపెద్ద ప్రైవేట్ రిటైలర్ ప్రకటన
Samayam Telugu26 Aug 2026
వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గింపు.. అతిపెద్ద ప్రైవేట్ రిటైలర్ ప్రకటన

Nayara Energy Petrol Price Cut 2026 : దేశీయ వాహనదారులకు ఒక క్రేజీ అప్డేట్. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరల్ని ఒక్కసారిగా భారీగా తగ్గించింది. తమ నయారా బంకుల్లో లీటరు పెట్రోల్‌పై రూ. 5, అలాగే డీజిల్‌పై రూ. 3 చొప్పున ధరల్ని తగ్గించింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు ఇప్పటివరకు ధరల తగ్గింపుపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో ఇతర ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక దేశీయంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం గత రెండేళ్ల కాలంలో ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిగా 2024 పార్లమెంట్ ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుపై రూ. 2 వరకు తగ్గగా తర్వాత చాలా కాలం స్థిరంగానే ఉన్నాయి. ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ వరుసగా పెరిగాయి. మే చివరి 2 వారాల్లో లీటరుపై రూ. 7.50 వరకు ధరలు పెరిగాయి. నయారా కూడా మార్చిలో ధరల్ని పెంచింది. దీంతో రెండేళ్ల తర్వాత ఇంధన ధరలు తగ్గించిన సంస్థగా నయారా ఎనర్జీ నిలిచింది.తగ్గుతున్న క్రూడాయిల్ ధరలుఅమెరికా- ఇరాన్ మధ్య మార్చి- జూన్ మధ్య యుద్ధం నేపథ్యంలో కొంత కాలంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక దశలో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 126 డాలర్ల స్థాయిని కూడా తాకగా అక్కడినుంచి క్రమంగా దిగొస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఒప్పందం జరగడం, శాంతి చర్చలు సానుకూలంగా సాగుతున్న క్రమంలో ముడి చమురు ధర ఇప్పుడు 74 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఈ