
UIDAI Update: మన దేశంలో ఆధార్ కార్డు ఎంతో కీలకమైనది. ఇది ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా తెరవాలన్నా, సిమ్ కార్డు కొనుగోలు చేయాలన్నా లేదా స్కూలు, కాలేజీల్లో అడ్మిషన్ పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ ఐదు పనులకు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే, అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక లావాదేవీల కోసం కూడా మన దేశంలో ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, స్కూల్ లేదా కాలేజీ అడ్మిషన్లు పొందాలన్నా ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ సేవలు అందుతాయి. అయితే మరో ఐదు పనుల కోసం ఆధార్ కార్డు ఉండటం అత్యవసరం. ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే మీరు పిఎఫ్ డబ్బులను విత్ డ్రా చేయాలంటే అది ఆధార్ వెరిఫికేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. మీ ఆధార్ నంబర్ పిఎఫ్‌కు లింక్ అయి ఉండాలి. దీనివల్ల మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ద్వారానే పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ వద్ద ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు ఉంటేనే పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తారు. పాస్‌పోర్ట్ పొందడానికి ఆధార్ కార్డును ఒక గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. మీ ఆధార్ కార్డు వివరాలు అప్‌డేటెడ్‌గా ఉంటే, పాస్‌పోర్ట్ కేవలం పది రోజుల్లోనే మీకు అందుతుంది. కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేదా ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కూడా ఆధార్ కార్డు ద్వారానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, లేనిపక్షంలో ఈ సేవలు పొందడం సాధ్యం కాదు. ఆధార్ కార్డు ఉంటేనే గ్యాస్ సబ్సిడీ కూడా లభిస్తుంది. ఆధార్