వైసీపీ పాలనలో ముద్రగడ్డ ఏం చేశారు
Actor ProfilePolitician

వైసీపీ పాలనలో ముద్రగడ్డ ఏం చేశారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వైసీపీ పాలనలో ముద్రగడ్డ ఏం చేశారు
Telugu Times19 Jun 2026
వైసీపీ పాలనలో ముద్రగడ్డ ఏం చేశారు

కుల రాజకీయాలకు కేరాప్ ఆడ్రస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y.S. Rajasekhara Reddy) కుటుంబమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి (Gorantla Butchaiah Chowdary) విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వంగవీటి మోహన్ రంగా (Vangaveeti Mohan Ranga), దేవినేని నెహ్రూ (Devineni Nehru) మధ్య వివాదాలకు రాజశేఖర్ రెడ్డి కులం రంగు పులిమి రాష్ట్రవ్యాప్తంగా ఆ రెండు కులాల మధ్య వైరం తీసుకొచ్చారన్నారు. తండ్రి బాటలోనే నడుస్తున్న ్పుగన్ సైతం కులాలు, మతాల పేరిట విభజించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్న ముద్రగడ వైసీపీ పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టిస్తోందన్నారు. జగన్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రెండేళ్ల కూటమి హయాంలో రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. త్వరలో పరిశ్రమలు పూర్తికానున్నాయని తెలిపారు