వైసీపీ నాయకులకు ఆ ప్రాంతంలో తిరిగే అర్హత లేదు
Actor ProfilePolitician

వైసీపీ నాయకులకు ఆ ప్రాంతంలో తిరిగే అర్హత లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వైసీపీ నాయకులకు ఆ ప్రాంతంలో తిరిగే అర్హత లేదు
Telugu Times13 Aug 2026
వైసీపీ నాయకులకు ఆ ప్రాంతంలో తిరిగే అర్హత లేదు

అమరావతి రాజధాని పేరు తలిచే అర్హత వైసీపీ ఏనాడో కోల్పోయిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ (Minister Kondapalli Srinivas) అన్నారు.పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం శ్రీనివాస్‌ విలేకర్లతో మాట్లాడారు. రాజధాని అమరాతి (Amaravati)లో రైతులపై కవ్వింపు చర్యలు చేపట్టే విధంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఉండవల్లి ప్రాంతంలో ఇసుమంత కూడా అభివృద్ధి చేయని వైసీపీ (YCP) నాయకులకు ఆ ప్రాంతంలో తిరిగే హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో శరవేగంగా జరుగుతున్న రాజదాని అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్‌ మావిగన్‌ అంటూ మరో నాటకానికి తెరలేపారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) సారథ్యంలో విజన్‌-2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే వైసీపీ నాయకులు పనిగా పెట్టు కున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి నాంది పలుకుతున్న లోకేశ్‌పై మాట్లాడే అర్హత గొడ్డలి పార్టీకి లేదన్నారు