వైసీపీ ఎమ్మెల్యేకు శ్రీశైలం దేవస్థానం నోటీసులు
Actor ProfilePolitician

వైసీపీ ఎమ్మెల్యేకు శ్రీశైలం దేవస్థానం నోటీసులు

Total News1
Movie Updates0
Sources1
వైసీపీ ఎమ్మెల్యేకు శ్రీశైలం దేవస్థానం నోటీసులు
Vaartha14 Jun 2026
వైసీపీ ఎమ్మెల్యేకు శ్రీశైలం దేవస్థానం నోటీసులు

Notice to YCP MLA : ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించిన ఒక విలాసవంతమైన కాటేజీని నిబంధనలకు విరుద్ధంగా వాడుకుంటున్నారనే ఆరోపణలపై దర్శి వైసిపి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి చుట్టూ వివాదం ముదిరింది. శ్రీశైల క్షేత్రంలో భక్తుల వసతి సౌకర్యార్థం కాటేజీ నిర్మాణ పథకం కింద బూచేపల్లి కుటుంబం గతంలో దేవస్థానం నుండి స్థలాన్ని పొందింది. ఆ స్థలంలో తమ సొంత ఖర్చులతో ఒక కాటేజీని కూడా నిర్మించారు. అయితే, దేవస్థానం నిబంధనల ప్రకారం.. భూమిని తీసుకుని కాటేజీ నిర్మించిన తర్వాత, గరిష్టంగా ఒక ఏడాది లోపు (అంటే 2023 నాటికే) ఆ భవనాన్ని పూర్తి అధికారాలతో శ్రీశైలం దేవస్థానానికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ, కాలపరిమితి ముగిసి మూడేళ్లు గడుస్తున్నా సదరు కాటేజీని దేవస్థానానికి అప్పగించకుండా, తమ సొంత అవసరాలకే వాడుకుంటున్నారని అధికారులు గుర్తించారు. Read Also ; కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు ఈ నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన శ్రీశైలం దేవస్థానం ఈఓ మరియు ఉన్నతాధికారులు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డికి అధికారికంగా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీని తుది గడువుగా విధిస్తూ.. ఆ లోపు కాటేజీని పూర్తి స్థాయిలో ఆలయ యంత్రాంగానికి స్వాధీనం చేయాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఒకవేళ నిర్ణీత గడువు లోగా స్పందించకపోయినా లేదా భవనాన్ని అప్పగించకపోయినా దేవస్థానం చట్టాల ప్రకారం తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సాధారణ భక్తులకు వసతి కొరత లేకుండా చూసేందుకు ఇలాంటి చర్యలు అవసరమని ఆలయ వర్గాలు చెబుతుండగా, ఈ నోటీసుల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరియు అటు ప్రకాశం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Ayatollah Ali Khamenei: జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన గమనిక: ఈ వెబ్ సైట్ లో