
టాలీవుడ్ బాస్, మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన చిరంజీవి.. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ బాస్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వరుస సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన చిరంజీవి.. ప్రస్తుతం బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీతో బిజీగా ఉన్నారు. అయితే చిరు నుంచి రావాల్సిన ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కీలక్ అప్టేడ్ రాలేదు. మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రామాలతో బిజీగా ఉంది. దీంతో రిలీజ్ డేట్‌పై మాత్రం ఇప్పటికీ సరైన క్లారిటీ రాలేదు. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే, ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా.. ఫ్యాన్స్‌ను కాస్త టెన్షన్ పెడుతూ వాయిదాల పర్వంలో చిక్కుకుంది. గతేడాది స్వయంగా మెగాస్టార్ చెప్పినా.. ఆ డెడ్ లైన్ కూడా మిస్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్‌లో కాస్త నిరాశ మొదలైంది. కానీ.. ఇప్పుడు వారిలో రెట్టింపు ఉత్సాహం నింపేలా ఒక సెన్సేషనల్ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘విశ్వంభర’ మూవీకి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. గ్రాఫిక్స్ పని పూర్తవ్వగానే, ఫైనల్ అవుట్‌పుట్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వీక్షించారట. స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూసి ఆయన పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. చిరు లాంటి పర్ఫెక్షనిస్ట్ ఆనందించారు అంటే.. తెరపై