విశ్వంభర కోసం రంగంలోకి నాగ్ అశ్విన్
Actor ProfileActor

విశ్వంభర కోసం రంగంలోకి నాగ్ అశ్విన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విశ్వంభర కోసం రంగంలోకి నాగ్ అశ్విన్
Chitrajyothy7 Jul 2026
విశ్వంభర కోసం రంగంలోకి నాగ్ అశ్విన్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర(Vishwambhara). మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర(Vishwambhara). యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ గ్రాండ్ విజువల్ వండర్‌పై మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంపై ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఎవరికీ ఒక స్పష్టమైన క్లారిటీ లేనప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం ఎక్కడా తగ్గకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా సాంకేతిక విభాగాలకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ భారీ ఫాంటసీ డ్రామాకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, తాజాగా హను-మాన్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యువ సంగీత దర్శకుడు గౌర హరి కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలోని కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను గౌర హరి పంచుకోనున్నారని, కీరవాణితో కలిసి ఆయన వర్క్ చేయడం సినిమాకు మరింత ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంగీతంతో పాటు సినిమాకు అత్యంత కీలకమైన విఎఫ్ఎక్స్ విభాగంలో కూడా స్టార్ డైరెక్టర్ రంగంలోకి దిగినట్లు ఒక సంచలన రూమర్ తెరపైకి వచ్చింది. కల్కి 2898 AD చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో విజువల్ అద్భుతాన్ని ఆవిష్కరించిన టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇప్పుడు విశ్వంభర విఎఫ్ఎక్స్ పనులను సూపర్వైజ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవుట్‌పుట్ మరింత నాణ్యంగా రావడం కోసం నాగ్ అశ్విన్ తన వంతు సలహాలు, సూచనలు ఇస్తున్నారని ఇండస్ట్రీ టాక్