విశాఖ నుంచి ప్రయాణిస్తున్నారా? జూలై 8 తర్వాత ఇదే కొత్త ఎయిర్ పోర్ట్.. మీ టికెట్ వివరాలు చెక్
Actor ProfilePolitician

విశాఖ నుంచి ప్రయాణిస్తున్నారా? జూలై 8 తర్వాత ఇదే కొత్త ఎయిర్ పోర్ట్.. మీ టికెట్ వివరాలు చెక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విశాఖ నుంచి ప్రయాణిస్తున్నారా? జూలై 8 తర్వాత ఇదే కొత్త ఎయిర్ పోర్ట్.. మీ టికెట్ వివరాలు చెక్
10TV Telugu3 Sept 2026
విశాఖ నుంచి ప్రయాణిస్తున్నారా? జూలై 8 తర్వాత ఇదే కొత్త ఎయిర్ పోర్ట్.. మీ టికెట్ వివరాలు చెక్

Vizag New Airport : విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వెళ్లే విమాన ప్రయాణికులకు కీలక అప్ డేట్.. జూలై 8 నుంచి విశాఖలోని విమాన సర్వీసుల్లో భారీ మార్పు జరగనుంది. ప్రస్తుతం విశాఖ నేవీ బేస్‌లోని పాత ఎయిర్‌పోర్టు నుంచి నడిచే పౌర విమాన సర్వీసులు ఇకపై భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మారనున్నాయి. దాంతో విమాన ప్రయాణికులు తమ టికెట్ వివరాలు, బయలుదేరే ఎయిర్ పోర్టు, ప్రయాణ సమయాన్ని ముందుగానే చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది.. దేశీయ విమాన సర్వీసులను అందించే ఎయిర్‌లైన్స్ ఇండిగో, ఎయిరిండియా సంస్థలు జూలై 8 నుంచి భోగాపురం మీదుగా కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. అయితే, అంతర్జాతీయ సర్వీసులను అందించే స్కూట్ ఎయిర్ లైన్స్ మాత్రం జూలై 25 నుంచి కొత్త ఎయిర్ పోర్టు నుంచి సేవలను అందించనుంది. అంతర్జాతీయ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మార్పును దశలవారీగా అమలు చేయనున్నాయి. ముందుగా విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ PNR స్టేటస్‌ చెక్ చేసుకోవాలి. ఎయిర్ పోర్టులో బయల్దేరే విమాన వివరాల్లో ఏమైనా మార్పులు జరిగాయా లేదా తెలుసుకోవాలి. మీకు ఏమైనా ఎయిర్‌లైన్ నుంచి ఈమెయిల్స్ లేదా మెసేజ్ లు వస్తే చెక్ చేసుకోండి. Read Also : Gold Price Today July 2 : బాబోయ్..! బంగారం మళ్లీ షాకిచ్చింది.. గోల్డ్ కొనాలా? వద్దా? ఈరోజు తులం ఎంత పెరిగిందంటే? కొత్త భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు విశాఖ సిటీకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముఖ్యంగా ఎంవీపీ కాలనీ, గాజువాక, కూర్మన్నపాలెం వంటి ప్రాంతాల మీదుగా వెళ్లే ప్రయాణికులు అదనంగా కనీసం 45 నిమిషాల ప్రయాణ సమయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హైవేపై ట్రాఫిక్ పరిస్థితులను బట్టి విమానం బయలుదేరే సమయానికి ముందుగానే ఇంటి నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ స్పెషల్