వ వసంతంలోకి రాహుల్.. ప్రధాని మోదీ
Actor ProfilePolitician

వ వసంతంలోకి రాహుల్.. ప్రధాని మోదీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వ వసంతంలోకి రాహుల్.. ప్రధాని మోదీ, రేవంత్ రెడ్డి స్పెషల్ విష్
Oneindia Telugu19 Jun 2026
వ వసంతంలోకి రాహుల్.. ప్రధాని మోదీ, రేవంత్ రెడ్డి స్పెషల్ విష్

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు (LoP) రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా పుట్టినరోజు అభినందనలు తెలియజేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘకాలం జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.రాహుల్ గాంధీ నేడు తన 56వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జాతీయ రాజధాని ఢిల్లీలోని ఇందిరా భవన్ వెలుపల అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన నేత: సీఎం రేవంత్ రెడ్డితెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఎక్స్ వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం పట్ల రాహుల్ గాంధీకి ఉన్న అచంచలమైన నిబద్ధత లక్షలాది మందికి నిరంతరం స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. దేశానికి, ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలు ఇలాగే కొనసాగాలని, ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా, సంపూర్ణ ఆరోగ్యంతో, దృఢంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.Rahul Gandhi: టెలిగ్రామ్ తర్వాత వాట్సాప్ బ్యాన్ ? రాహుల్ షాకింగ్ హింట్..!Gen Z వాయిస్ ఆయనే.. కాంగ్రెస్ పార్టీ భావోద్వేగ పోస్ట్ఇదే సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) అధికారిక సోషల్ మీడియా ఖాతా రాహుల్ గాంధీపై ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకుంది. చాలా మంది మౌనంగా ఉండేందుకు ఇష్టపడే ఈ రోజుల్లో, మీరు నమ్మిన నిజం కోసం నిరంతరం గళం విప్పుతూనే ఉన్నారు. అన్యాయం, అసమానత, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న అలుపెరగని పోరాటం కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపింది.