
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేసింది. సోమవారం ఉదయం నుంచి ఖాతాల్లో పరిహారం ప్యాకేజీ మొత్తం జమ అవుతున్నాయి. అమరావతి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) జమ చేసింది. ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి ఖాతాల్లో పరిహారం ప్యాకేజీ మొత్తం జమ అవుతున్నాయి. ఒక్కో నిర్వాసితునికి రూ.12.50 లక్షల నుంచి రూ.12.76 లక్షల వరకూ జమ చేస్తోంది. శనివారం యర్రగొండపాలెం నియోకవర్గం, గంటవానిపల్లెలో నిర్వాసితులకు రూ.300 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబు అందజేసిన విషయం తెలిసిందే. 2,351 నిర్వాసిత కుటుంబాలకు రూ.300 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మరుసటి రోజు ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం నుంచి నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం సొమ్ము మొత్తం జమ అవుతున్నాయి. పరిహారం కోసం దశాబ్దాలుగా నిర్వాసితులు ఎదురు చూశారు. ఇచ్చిన మాట ప్రకారం పరిహారాన్ని సీఎం చంద్రబాబు అందజేశారు. పరిహారం సొమ్ము ఖాతాల్లో పడటంతో వెలిగొండ నిర్వాసిత గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి: అనిత ట్రంప్, పుతిన్‌లకు కూడా ఫిర్యాదు చేయండి.. నానిపై శివనాథ్ సెటైర్లు