వేల కోట్లకు చేరిన కోలివింగ్ వ్యాపారం
Actor ProfileActor

వేల కోట్లకు చేరిన కోలివింగ్ వ్యాపారం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వేల కోట్లకు చేరిన కోలివింగ్ వ్యాపారం
TeluguOne14 Jul 2026
వేల కోట్లకు చేరిన కోలివింగ్ వ్యాపారం

భారతదేశంలో మెట్రోపాలిటన్ సంస్కృతి శరవేగంగా మారిపోతోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, యువ టెక్కీల జీవన విధానంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు చదువు కోసమో, ఉద్యోగం కోసమో నగరాలకు వస్తే అబ్బాయిలు విడిగా రూములు, అమ్మాయిలు ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌లో ఉండేవారు. కానీ.. ఇప్పుడు ఆ పాత పద్ధతులకు కాలం చెల్లింది. సమాజంలో సరికొత్తగా దూసుకొచ్చిన కో-లివింగ్ కల్చర్ ఇప్పుడు ఒక పెను సంచలనంగా మారింది. కేవలం ఇదొక జీవన విధానం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భారీ వ్యాపార సామ్రాజ్యంగా అవతరించిందని ప్రముఖ విశ్లేషకులు భరద్వాజ చెప్పారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో ఈ కో లివింగ్ మార్కెట్ విలువ అక్షరాలా 4,000 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. ఇందులో హైదరాబాద్ వాటానే దాదాపు 750 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. ఈ సరికొత్త కో-లివింగ్ విధానంలో ఆడ, మగ అనే తేడా లేకుండా స్నేహితులు లేదా సహోద్యోగులు కలిసి పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ మందగమనం వల్ల 80 వేల నుంచి లక్ష ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఐదు, ఆరు బెడ్‌రూమ్‌లు ఉండే ఇలాంటి భారీ ఫ్లాట్లను.. పెంట్ హౌస్‌లను ఐటీ టెక్కీలు గ్రూపులుగా ఏర్పడి అద్దెకు తీసుకుంటున్నారు. సాధారణ పీజీ హాస్టల్స్ కంటే ఇక్కడ అద్దెలు చాలా ఎక్కువ అయినప్పటికీ.. ఐటీ రంగానికి చెందిన యువత ఖర్చుకు వెనుకాడటం లేదు. సొంతంగా వంటమనుషులను పెట్టుకుని, తమకు నచ్చిన ఆహారాన్ని వండించుకుంటూ, వీకెండ్స్ వస్తే హోమ్ థియేటర్లు, మినీ బార్ సెటప్‌లతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సరికొత్త లైఫ్ స్టైల్‌కు మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన యువతే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. చిన్న నగరాలు, గ్రామాల నుండి వచ్చి, సినిమాల్లో చూసిన లగ్జరీ జీవితాన్ని ఇక్కడ ఓపెన్‌గా అనుభవించాలనుకుంటున్నారు. అయితే