వైరల్ గా మారిన ఆలియా ఎపిసోడ్.. లాటెంట్ సీజన్ 2కి అదిరిపోయే ఆరంభం
Actor ProfileActor

వైరల్ గా మారిన ఆలియా ఎపిసోడ్.. లాటెంట్ సీజన్ 2కి అదిరిపోయే ఆరంభం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వైరల్ గా మారిన ఆలియా ఎపిసోడ్.. లాటెంట్ సీజన్ 2కి అదిరిపోయే ఆరంభం
Telugu Times2 Jul 2026
వైరల్ గా మారిన ఆలియా ఎపిసోడ్.. లాటెంట్ సీజన్ 2కి అదిరిపోయే ఆరంభం

భారతీయ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఇండియాస్ గాట్ లాటెంట్(Indias Got latent) రెండో సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రముఖ కామెడియన్ సమయ్ రైనా హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షో కొత్త ఎపిసోడ్ రిలీజైన కేవలం 15 గంటల్లోనే సుమారు 15 మిలియన్లకు పైగా వ్యూస్ నమోదు చేసినట్లు సమాచారం. ఈ అద్భుత స్పందనతో సోషల్ మీడియాలో షో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత సీజన్‌కు లభించిన ఆదరణను కొనసాగిస్తూ, కొత్త సీజన్ కూడా అదే స్థాయి వినోదాన్ని అందిస్తోందనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ ఎపిసోడ్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలిఆ భ‌ట్‌(Alia Bhatt) స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు. తన రాబోయే సినిమా ఆల్ఫా(Alpha) ప్రమోషన్స్‌లో భాగంగా షోలో పాల్గొన్న ఆమె, ఆ షోప్రత్యేక శైలికి తగ్గట్టుగా సరదా సెటైర్లు మరియు కామెడీ పంచ్‌లను ఎదుర్కొన్నారు. సమయ్ రైనా సహా పలువురు కంటెస్టెంట్లు ఆమెపై చమత్కారమైన జోకులు వేయగా, ఆలియా వాటిని ఎంతో స్పోర్టివ్‌గా స్వీకరించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె రియాక్షన్స్ షోలో మరింత వినోదాన్ని జోడించాయని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన అనేక వీడియో క్లిప్స్ సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆలియా భట్‌పై వచ్చిన ఫన్నీ కామెంట్లు, ఆమె ఇచ్చిన రియాక్ష‌న్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో షోకు మరింత ప్రచారం లభించడమే కాకుండా, రెండో సీజన్‌పై అంచనాలు కూడా పెరిగాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వినోదాత్మక కంటెంట్‌కు ప్రేక్షకులు ఎంత పెద్ద స్థాయిలో స్పందిస్తున్నారో ఈ ఎపిసోడ్ మరోసారి నిరూపించినట్లైంది