వారెవ్వా.. మల్లీశ్వరీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయిందో చూశారా.. ? హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్
Actor ProfileActor

వారెవ్వా.. మల్లీశ్వరీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయిందో చూశారా.. ? హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్

Total News1
Movie Updates0
Sources1
వారెవ్వా.. మల్లీశ్వరీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయిందో చూశారా.. ? హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్
TV9 Telugu15 Jun 2026
వారెవ్వా.. మల్లీశ్వరీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయిందో చూశారా.. ? హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్

తెలుగు సినీ పరిశ్రమలో బాలనటులుగా అలరించి, ఆ తర్వాత కాలంలో ఎంతోమంది హీరోయిన్లుగా మారి తమదైన ముద్ర వేసుకున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న పేరు 'గ్రీష్మ నేత్రిక'. ఒకప్పుడు ఎంతోమంది అగ్రనటుల చిత్రాల్లో బాలనటిగా అల్లరి చేసిన గ్రీష్మ, ఇప్పుడు అద్భుతమైన మార్పుతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. 'మల్లీశ్వరి' వంటి క్లాసిక్ సినిమాల్లో బాలనటిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన గ్రీష్మ, తన చిలిపి నటనతో ప్రేక్షకులను అలరించింది. కేవలం మల్లీశ్వరి మాత్రమే కాకుండా 'అమ్ములు', 'అశోక్', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'ప్రస్థానం', 'పంచాక్షరి', 'ఏమో గుర్రం ఎగరవచ్చు' వంటి పలు చిత్రాల్లో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. ఆ సినిమాల్లో ఆమె కనిపించిన తీరు, అభినయం ఇప్పటికీ చాలామందికి గుర్తే. ప్రస్తుతం గ్రీష్మ నేత్రిక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పటి చిన్నారి గ్రీష్మ, ఇప్పుడు ఎంతో అందంగా, స్టైలిష్‌గా మారిపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె గ్లామరస్ ఫోటోషూట్స్ చూస్తుంటే, త్వరలోనే ఆమె హీరోయిన్‌గా వెండితెరపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని అర్థమవుతోంది. ఆమె స్టైలింగ్, ఫోటోల్లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే, గ్లామర్ ఇండస్ట్రీలో రాణించేందుకు కావాల్సిన లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సక్సెస్ అందుకున్న గ్రీష్మ, ఇప్పుడు హీరోయిన్‌గా కూడా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తన తాజా ఫోటోలతో గ్లామర్ ప్రపంచానికి తాను సిద్ధమేనని సంకేతాలు ఇస్తోంది. ఆమె సోషల్ మీడియా పోస్టులకు అభిమానుల నుంచి, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇంతగా మారిపోవడంతో అభిమానులు ఆమె కొత్త ప్రాజెక్టుల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి గ్రీష్మ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఎలా మొదలుపెడుతుందో చూడాలి! చైల్డ్ ఆర్టిస్ట్‌గా దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె, ప్రస్తుతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సినిమాల్లో