విరాట్ కోహ్లీ కంటే స్పీడ్ గురూ.. 6 ఇన్నింగ్స్ ల్లోనే జైస్వాల్ వరల్డ్ రికార్డ్
Actor ProfileCelebrity

విరాట్ కోహ్లీ కంటే స్పీడ్ గురూ.. 6 ఇన్నింగ్స్ ల్లోనే జైస్వాల్ వరల్డ్ రికార్డ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విరాట్ కోహ్లీ కంటే స్పీడ్ గురూ.. 6 ఇన్నింగ్స్ ల్లోనే జైస్వాల్ వరల్డ్ రికార్డ్
Asianet News Telugu22 Jun 2026
విరాట్ కోహ్లీ కంటే స్పీడ్ గురూ.. 6 ఇన్నింగ్స్ ల్లోనే జైస్వాల్ వరల్డ్ రికార్డ్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో భారత్ ఓడించింది. ఈ బిగ్ విక్టరీతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ముందుగా ప్రసిద్ధ్ కృష్ణ కెరీర్ బెస్ట్ బౌలింగ్ (5/23)తో ఆఫ్ఘన్‌ను దెబ్బతీయగా, ఆ తర్వాత లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్ (110 నాటౌట్), రోహిత్ శర్మ (79) వీరవిహారం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ సెంచరీ (102) చేసినప్పటికీ, భారత బ్యాటర్ల ధాటికి అది కేవలం ఒక సాధారణ ఇన్నింగ్స్‌గా మిగిలిపోయింది. 219 పరుగుల టార్గెట్‌ను భారత్ కేవలం 28.4 ఓవర్లలోనే ఒకే ఒక వికెట్ కోల్పోయి 224 పరుగులు చేసి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో యశస్వి జైస్వాల్ ఒక అరుదైన రికార్డును సాధించాడు. వన్డే క్రికెట్ హిస్టరీలో తన మొదటి 6 ఇన్నింగ్స్‌ల్లోనే రెండు సెంచరీలు బాదిన మొదటి భారతీయ బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. ఈ క్రమంలో అతను టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టాడు. ధావన్ తన మొదటి రెండు వన్డే సెంచరీలను 7 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా, జైస్వాల్ కేవలం 6 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఫీట్ సాధించాడు. అంతేకాదు, టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ (17 ఇన్నింగ్స్‌లు), శుభ్‌మన్ గిల్ (18 ఇన్నింగ్స్‌లు) కంటే చాలా వేగంగా జైస్వాల్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. భారత ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే విచిత్రంగా టీమిండియా స్కోరు బోర్డు 5/0 కు చేరింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ షాహిదీ పిచ్‌పై పెనాల్టీ జోన్‌లోకి పదే పదే పరిగెత్తడంతో అంపైర్లు ఆఫ్ఘనిస్తాన్‌కు 5 పరుగుల పెనాల్టీ విధించారు. ఆ ఐదు పరుగులు భారత్‌కు లభించాయి. ఇక ఛేదనలో జైస్వాల్ మొదటి ఓవర్ నుంచే అటాకింగ్ మోడ్ ఆన్ చేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు