వారం గ్యాప్ లో రాశీ సింగ్ రెండు సినిమాలు
Actor ProfileActor

వారం గ్యాప్ లో రాశీ సింగ్ రెండు సినిమాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వారం గ్యాప్ లో రాశీ సింగ్ రెండు సినిమాలు
Chitrajyothy7 Jul 2026
వారం గ్యాప్ లో రాశీ సింగ్ రెండు సినిమాలు

హీరోయిన్‌ రాశీ సింగ్ వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. గత శుక్రవారం ఆమె నటించిన 'ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు' సినిమా విడుదల కాగా, ఈ శుక్రవారం ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ 'గాసిప్' విడుదల కాబోతోంది. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ను, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ సోషల్ సెటైర్‌గా వైభవ్ కౌండిన్య 'గాసిప్‌' (Gossip) చిత్రాన్ని రూపొందించారు. దీనిని యతి నిర్మించారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో రాశీసింగ్ కథానాయికగా నటించగా, రవివర్మ (Ravivarma), మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ఆర్టిస్ట్ విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. 'గాసిప్‌' మూవీ ఈ నెల 26న విడుదల కాబోతున్న సందర్భంగా ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి మూవీ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నటుడు మహేష్ యడ్లపల్లి మాట్లాడుతూ, 'ప్రస్తుత సమాజంలో చూస్తున్న కొన్ని సంఘటనలకు దగ్గరగా ఉన్న ఒక విషయాన్ని సినిమాగా చేశాం. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నాకు అవకాశం ఇచ్చిన వైభవ్ గారికి, యతి గారికి థాంక్స్. రాశి సింగ్ గారితో పని చేయడం సంతోషకరం. శక్తికాంత్ కార్తీక్ సినిమాకు మంచి సంగీతాన్ని అందించారు. అందరూ మా సినిమాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. దర్శకుడు వైభవ్‌ కౌండిన్య మాట్లాడుతూ, 'ఇది నా మొదటి సినిమా. దీనికి నేను రచయితగా, దర్శకుడిగా పని చేశాను. మన జీవితాల్లో గాసిప్ అనేది సాధారణ విషయమే. కానీ మనం సరదాగా మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఇతరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం. ఇందులో నా జీవితంలో, నా స్నేహితుల జీవితాల్లో జరిగిన కొన్ని నిజ సంఘటనలు కూడా ఉన్నాయి. మాటకు