వ్యక్తిని చంపి బూడిదైన ఇవ్వరా
Actor ProfilePolitician

వ్యక్తిని చంపి బూడిదైన ఇవ్వరా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వ్యక్తిని చంపి బూడిదైన ఇవ్వరా
Sakshi1 Jul 2026
వ్యక్తిని చంపి బూడిదైన ఇవ్వరా

సాక్షి, కాకినాడ: ఒక వ్యక్తిని చంపి అతని బూడిదకూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమైన విషయమని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. సాయికృష్ణ కేసుపై కాకినాడలో ఆయన ఈ రోజు ( సోమవారం) మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సొంత రాజ్యాంగం అమలు చేస్తోందని దుయ్యబట్టారు. సాయికృష్ణ, క్రాంతికుమార్‌ మరణాలపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని ఇటీవల జరిగిన ఐదుగురి హత్యలు పోలీసుల చేసిన హత్యలేనన్నారు. సాయికృష్ణపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఎమ్మెల్యే పంతం నానాజీ సంస్కార హీనంగా దిగజారి మాట్లాడుతున్నారన్నారు. పంతం నానాజీ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి పంతం నానాజీకి లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు.? కాపుల గురించి మాట్లాడిన నేతలపై నీచంగా మాట్లాడితే ఎ‍ట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదని ఆవిషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతో భరోసా బాధితులు అధికంగా కాపు నేతలే ఉన్నారని ఈ అంశంలో కాపు నేతలంతా కలిసి మాట్లాడుకుంటే మీకొచ్చిన నొప్పేంటి అని ప్రశ్నించారు. కాపులకు జరుగుతున్న అన్యాయాల గురించి కూటమి నేతలు ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు) సిల్వర్‌ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్ ‘హను మాన్‌ 3డీ’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) సౌత్ సినిమా నయా సెన్సేషన్.. మమితా బైజు బర్త్‌డే స్పెషల్‌( ఫొటోలు) 'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు) దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..!