వెయిట్ ఈజ్ ఓవర్.. యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
Actor ProfileActor

వెయిట్ ఈజ్ ఓవర్.. యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెయిట్ ఈజ్ ఓవర్.. యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
TV9 Telugu23 Jun 2026
వెయిట్ ఈజ్ ఓవర్.. యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 'టాక్సిక్ ' సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది . చివరకు , ఈ ఏడాది ఆగస్టు 26న 'టాక్సిక్' చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 'కేవీఎన్ ప్రొడక్షన్స్' సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీని నిర్మిస్తోంది. యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా యష్‌కు 'టాక్సిక్' చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. 'KGF: చాప్టర్ 2' తర్వాత అతను అంగీకరించిన చిత్రం ఇదే. అందుకే ఈ సినిమాను చాలా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేస్తున్నారు. పెద్ద విదేశీ కంపెనీలు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. యష్ ఇప్పటికే విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సినిమా గురించి హైప్ పెంచుతున్నాడు. అనుకున్నదంతా జరిగి ఉంటే, 'టాక్సిక్' సినిమా ఇప్పటికి విడుదలై ఉండాలి. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ రెండుసార్లు వాయిదా పడింది. మొదటిసారి యుద్ధం కారణంగా 'టాక్సిక్' విడుదల తేదీ వాయిదా పడింది. ఇక రెండోసారి, సినిమా మార్కెట్‌ను విస్తరించడం కోసం విడుదల తేదీని వాయిదా వేశారు. ఇక 'టాక్సిక్' చిత్రంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు సంచలనం సృష్టించాయి. అలాగే వివాదాలకు కూడా కారణమయ్యాయి. అలాగే ఇలాంటి ఊర మాస్ చిత్రాన్ని ఒక మహిళా దర్శకురాలు కూడా సమర్థంగా హ్యాండిల్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్ర కథా రచనలో యష్ కూడా పాలుపంచుకున్నారు. Honour Thy Father...#Toxic In Cinemas Worldwide from