విమానాశ్రయాల్లో బార్ లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Actor ProfilePolitician

విమానాశ్రయాల్లో బార్ లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విమానాశ్రయాల్లో బార్ లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Eenadu4 Aug 2026
విమానాశ్రయాల్లో బార్ లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

అమరావతి: తిరుపతి మినహా మిగిలిన విమానాశ్రయాల్లో బార్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విమానాశ్రయాల్లో బార్‌ లైసెన్స్‌లు మంజూరు చేయాలని ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక విమానాశ్రయ బార్‌ లైసెన్స్‌ కింద గరిష్ఠంగా 3 సర్వీసింగ్‌ పాయింట్లకు అనుమతించింది. 24 గంటల పాటు బార్‌లు తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే, విమానాశ్రయ కార్యాచరణ అవసరాలకు లోబడి బార్‌లు తెరవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భద్రతా ఆదేశాలు, శాంతిభద్రతల అవసరాలకు లోబడి పని చేయాల్సి ఉంటుందని తెలిపింది. విమానాశ్రయాల్లో బార్‌ లైసెన్స్‌ల నిర్వహణపై మంత్రుల బృందం అధ్యయనం చేసింది. దిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాలను పరిశీలించింది. మంత్రుల బృందం సూచనలతో లైసెన్స్‌ రుసుము, పని వేళలు, మద్యం అందించే కేంద్రాల కౌంటర్లపై తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తోంది విజయవాడకు చెందిన షణ్ముఖ నందిని. కర్ణాటక స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌ షిప్‌లో తెలుగు బాలుడు సత్తా చాటాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆంధ్రుల ఎన్నో ఏళ్ల కల.. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. కృష్ణాజిల్లా పామర్రులో భారీ వర్షం కురుస్తోంది. ఆయన ఓ అథ్లెట్‌. చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసిన మనిషి