
IND vs ENG : భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ పర్యటనలో ఈ వండర్‌కిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడని ఫ్యాన్స్, బ్రాడ్‌కాస్టర్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం అతడిని తుది జట్టులోకి తీసుకోకుండా బెంచ్‌కే పరిమితం చేసింది. ఐర్లాండ్ వంటి చిన్న జట్టుపై మ్యాచ్ అయితే ఈ కుర్రాడికి ఒత్తిడి తక్కువగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆ సిరీస్‌లో భారత్ 0-2తో ఓడిపోవడమే కాకుండా వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, వైభవ్ తన అరంగేట్రం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని అనడం మరింత దుమారం రేపింది. వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోకపోవడంపై బీహార్‌లోని బేగుసరాయ్ ఎంపీ, కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా స్పందించారు. బీహార్‌లోని సమస్తీపూర్‌కు చెందిన ఈ 15 ఏళ్ల స్టార్ ప్లేయర్‌ను పక్కన పెట్టడంపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లను ఆయన తప్పుబట్టారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్, బ్రయాన్ లారా వంటి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలే వైభవ్ టాలెంట్‌ను మెచ్చుకుంటూ, అతని చుట్టూ టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను నిర్మించవచ్చని అన్నారని గుర్తు చేశారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు ఉన్న వైభవ్ ప్రపంచ క్రికెట్ భవిష్యత్తు అని, అలాంటి ఆటగాడిని ఎందుకు ఆడించట్లేదని మంత్రి ప్రశ్నించారు. ఇంగ్లాండ్‌తో జూలై 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ మొదటి మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఈ రాజకీయ ఒత్తిడిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ రాజకీయ నాయకుల నుంచి వస్తున్న డిమాండ్లపై మీడియా ప్రశ్నించగా శ్రేయస్ అయ్యర్ చాలా కూల్‌గా