వెబ్ సైట్ డౌన్.. 7 రోజులుగా
Actor ProfilePolitician

వెబ్ సైట్ డౌన్.. 7 రోజులుగా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెబ్ సైట్ డౌన్.. 7 రోజులుగా పైసలు రాక జనాల తిప్పలు.. ఏం చేస్తోంది బాస్
Zee Telugu31 Aug 2026
వెబ్ సైట్ డౌన్.. 7 రోజులుగా పైసలు రాక జనాల తిప్పలు.. ఏం చేస్తోంది బాస్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPFO online services suspension: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ వ్యవస్థను వేగవంతం చేయడం.. విశ్వసనీయత, భద్రతను మెరుగుపరచడానికి, ముందుగా నిర్ణయించిన డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లను చేపట్టేందుకు అనేక ఆన్‌లైన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. వెబ్‌సైట్‌లో తెలిపిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ మార్పు.. సేవల పంపిణీని మెరుగుపరచడం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందించడం అని పేర్కొంది. ఈ అప్‌గ్రేడ్‌లో భాగంగానే ఈపీఎఫ్ఓ తన డేటాబేస్‌లను ఏకీకృతం చేస్తోంది. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ కోసం ఉపయోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ అంతరాయం జూన్ 26న అర్ధరాత్రి 12:00 గంటలకు ప్రారంభమై.. జూలై 1న రాత్రి 11:59 గంటల వరకు కొనసాగాల్సి ఉండగా.. జూలై 2న అర్ధరాత్రి 12:00 గంటలకు సేవలు తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపింది. గురువారం ఉదయం కూడా సర్వీస్ అందుబాటులో లేదు. దీంతో కొంతమంది ఈ సమస్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. షెడ్యూల్ చేసిన డౌన్‌టైమ్ ముగిసింది.. కానీ EPFO పోర్టల్ ఇప్పటికీ అందుబాటులో లేదు. వేలాది మంది వినియోగదారులు దీనికోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఆలస్యం ఎందుకు అవుతుందో దయచేసి కారణం చెప్పండి.. సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో వివరించండి అంటూ ఎక్స్ వేదికగా ఒక వినియోగదారుడు పోస్టు చేశారు. ఈ డౌన్‌టైమ్ సమయంలో.. పీఎఫ్ సభ్యులతోపాటు యజమానులు మెంబర్ ఇంటర్‌ఫేస్ లేదా ఎంప్లాయర్ ఇంటర్‌ఫేస్‌లోకి లాగిన్ అయ్యే అవకాశం ఉండదు. దీనివల్ల ఈ పోర్టల్‌ల ద్వారా అందుబాటులో ఉన్న అన్ని ఆన్‌లైన్ సేవలు నిలిచిపోతాయి. ఇందులో కొత్త ఈపీఎఫ్ క్లెయిమ్‌లను సమర్పించడం.. క్లెయిమ్ ప్రాసెసింగ్.. ఇ-పాస్‌బుక్