వెనిజులాలో ప్రళయం.. 7.5 తీవ్రతతో భూకంపం
Actor ProfilePolitician

వెనిజులాలో ప్రళయం.. 7.5 తీవ్రతతో భూకంపం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెనిజులాలో ప్రళయం.. 7.5 తీవ్రతతో భూకంపం, 10,000 మంది మృతి? కూలిన భవనాలు, భీతిల్లుతున్న జనం
Zee Telugu18 Jul 2026
వెనిజులాలో ప్రళయం.. 7.5 తీవ్రతతో భూకంపం, 10,000 మంది మృతి? కూలిన భవనాలు, భీతిల్లుతున్న జనం

Venezuela Earthquake Photos: వెనిజులాలో సంభవించిన భారీ భూకంపం కారణంగా పదివేల మంది మృతి చెంది ఉండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో వరుసగా రెండుసార్లు భూకంపాలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాజధాని కరాకాస్, మోంటెన్ ప్రాంతాల్లో భవనాలు కూలిపోయిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శిథిలాల కింద పదివేలకు పైగా మంది చిక్కుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే వెనిజులాలో రెండు భూకంపాలు సంభవించాయి. బుధవారం సాయంత్రం మొదట 7.1 తీవ్రతతో, అనంతరం 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీనిని అత్యంత శక్తివంతమైన భూకంపంగా పరిగణిస్తున్నారు. ఈ విపత్తు వల్ల ఇప్పటికి 10,000 మందికి పైగా మృతి చెంది ఉండవచ్చని అమెరికన్ జియోలాజికల్ సర్వే అంచనా వేస్తోంది. విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, నివాస ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి భూకంపం కరాకాస్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో సంభవించగా, రెండో భూకంపం మొరన్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంప ప్రభావం కరాకాస్ తో పాటు మీరాండా, ఆరాగ్వా, లాగ్ వైరా వంటి రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. భారీ భవనాలు సైతం నేలకూలడంతో పదివేల మంది శిథిలాల కింద చిక్కుకొని మరణించి ఉండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేస్తోంది. భవనాలు కూలిన ప్రాంతాల్లో దుమ్ము మేఘాలు కమ్ముకోవడంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా చీకటి పరిస్థితులు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా ఎత్తైన భవనాలు కూలిపోవడంతో, కాంక్రీట్ ముక్కలు, ఇనుప కడ్డీల మధ్య చిక్కుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని కరాకాస్ వీధుల్లో గందరగోళం నెలకొనగా, గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని ఫోటోల ప్రకారం, శిథిలాల కింద చిక్కుకున్న