వేధించి చంపేశారు
Actor ProfilePolitician

వేధించి చంపేశారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వేధించి చంపేశారు
Sakshi6 Sept 2026
వేధించి చంపేశారు

క్రాంతికుమార్‌ కుమారుడు రవిచంద్ర ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని చలించిపోయి బాలుడి కాలు పట్టుకుని గాయాన్ని పరిశీలిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ జగన్‌కు క్రాంతికుమార్‌ కుటుంబం విజ్ఞప్తి పోలీసుల వేధింపుల గురించి వివరించిన తల్లిదండ్రులు కోడిని వేలాడదీసినట్టు వేలాడదీసి కొట్టేవారు అనాథలమైపోయామని క్రాంతికుమార్‌ భార్య కన్నీటిపర్యంతం క్రాంతికుమార్‌ కుమారుడికి దీర్ఘకాలంగా అనారోగ్య సమస్య కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్‌ జగన్‌ భరోసా సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘‘పోలీసుల వేధింపుల వల్లే నా కొడుకు అన్యాయంగా చనిపోయాడు. ఆరోజు పోలీసులు ఇంటికి వచ్చి బెదిరించడంతో తలుపులు వేసుకుని భయంతో పురుగుల మందు గుళికలు తిని ప్రాణాలు తీసుకున్నాడు’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట క్రాంతికుమార్‌ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. గురువారం కృష్ణలంకలోని క్రాంతికుమార్‌ ఇంటికి వెళ్లిన వైఎస్‌ జగన్‌ ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన కొడుకు వీడియో వాంగ్మూలంలో చెప్పినట్టుగా సీఐ నాగరాజు వేధింపుల వల్లే చనిపోయాడని, తనను కులం పేరుతో సీఐ దూషించాడని, ఈ రెండు విషయాలపై కేసులు కట్టి సీబీఐతో విచారణ జరిపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని క్రాంతికుమార్‌ తల్లిదండ్రులు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఏం జరిగిందంటే... క్రాంతికుమార్‌ ఆత్మహత్య ఘటన ఏరోజు జరిగిందని వైఎస్‌ జగన్‌ అడగ్గా మే 21న జరిగిందని వెంకటేశ్వరరావు వివరించారు. ‘‘ మే 21న మా ఇంటికి పోలీసులు వచ్చారు. వారిని చూసి నా కుమారుడు భయంతో లోపలికి వెళ్లి తలుపువేసుకున్నాడు. తలుపు తీయాలని వాళ్ల అమ్మ పిలిస్తే.. తలుపు తీస్తే పోలీసులు తనను చంపేస్తారంటూ పురుగుమందుల గుళికలు తినేశాడు. వాళ్ల అమ్మ దుఖంతో కేకలు వేస్తే తలుపు తీసాడు. హడావుడిగా హెల్ప్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అయినా ప్రాణం దక్కలేదు’’ అని వెంకటేశ్వరరావు జగన్‌కు చెప్పారు. సాయికృష్ణ తరహాలోనే తనను కూడా పోలీసులు కొట్టి చంపేస్తారన్న భయంతో ప్రాణం తీసుకున్నాడని తెలిపారు. క్రాంతి