విదేశీ పర్యటనల్లో పారిశ్రామిక వేత్తలను భాగస్వామ్యం చేస్తాం
Actor ProfilePolitician

విదేశీ పర్యటనల్లో పారిశ్రామిక వేత్తలను భాగస్వామ్యం చేస్తాం

Total News1
Movie Updates0
Sources1
విదేశీ పర్యటనల్లో పారిశ్రామిక వేత్తలను భాగస్వామ్యం చేస్తాం
Andhra Jyothy15 Jun 2026
విదేశీ పర్యటనల్లో పారిశ్రామిక వేత్తలను భాగస్వామ్యం చేస్తాం

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను విదేశాలల్లో వివరించే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం సీఐఐ ఏపీ బిజినెస్ డెలిగేషన్‌తో ఆయన సమావేశమయ్యారు. సింగపూర్, జూన్15: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను విదేశాలల్లో వివరించే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం సీఐఐ ఏపీ బిజినెస్ డెలిగేషన్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడం అంటే.. సొంత రాష్ట్రంలో అవకాశాలను సృష్టించడమేనని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ బలాలను వివరించి విదేశీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావాలని వారికి సూచించారు. అవసరమైతే విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో పరిశ్రమలు స్థాపించాలనీ చెప్పారు. అదే విధంగా ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీని, వ్యాపారాన్ని రాష్ట్రానికి పరిచయం చేయాలని పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మంచి పాలసీలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే కంపెనీలకు సహకరించే ప్రభుత్వం కూడా ఉందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో మానవ వనరులు, భూములు, నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఏ రంగంలో అయినా పెట్టబడులు పెట్టవచ్చని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి సెమీ కండక్టర్ వరకు మనం బెస్ట్ పాలసీలతో సిద్ధంగా ఉన్నామని వారికి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని విదేశాల్లో బ్రాండ్ చేసే బాధ్యతను పారిశ్రామిక వేత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ప్రపంచంలో అనేక చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అన్ని రంగాల్లో తెలుగు పారిశ్రామిక వేత్తలు ఉన్నారని.. మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉందని వారికి వివరించారు. నేటి టెక్నాలజీ యుగంలో కొత్త ఆలోచనలు చేయాలని పారిశ్రామికవేత్తలను సీఎం ప్రోత్సహించారు. రాష్ట్రం, దేశం తరఫున విదేశీ