విద్యార్థులకు చాక్లెట్లతో వెల్కమ్.. విద్యానగర్ స్కూల్లో రహదారి భద్రత
Actor ProfilePolitician

విద్యార్థులకు చాక్లెట్లతో వెల్కమ్.. విద్యానగర్ స్కూల్లో రహదారి భద్రత

Total News2
Movie Updates0
Sources1
చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన మంత్రి సీత క్క
Vaartha15 Jun 2026
చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన మంత్రి సీత క్క

Telangana news:అంగన్‌వాడీ కేంద్రాలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు- మంత్రి సీతక్క, హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో

విద్యార్థులకు చాక్లెట్లతో వెల్కమ్.. విద్యానగర్ స్కూల్లో రహదారి భద్రతపై బేగంపేట అవగాహన సదస్సు
Vaartha15 Jun 2026
విద్యార్థులకు చాక్లెట్లతో వెల్కమ్.. విద్యానగర్ స్కూల్లో రహదారి భద్రతపై బేగంపేట అవగాహన సదస్సు

Hyderabad Traffic Police: విద్యార్థులకు ‘వెల్కమ్ బ్యాక్ టు స్కూల్’ – విద్యానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్రాఫిక్ భద్రతా అవగాహన కార్యక్రమం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ గారు, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ శ్రీ జోయెల్ డేవిస్, ఐపీఎస్ గారు మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఈ రోజు (15-06-2026) బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (TTI) ఆధ్వర్యంలో విద్యానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలురు & బాలికలు) విద్యార్థుల కోసం ‘వెల్కమ్ బ్యాక్ టు స్కూల్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. Read Also :Revanth Reddy: వర్షాల నేపథ్యంలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ ఈ సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలుకుతూ రోడ్డు భద్రత సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించడంతో పాటు చాక్లెట్లు మరియు పుష్పాలను అందజేశారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాలు, రహదారి చిహ్నాలు, పాదచారుల భద్రత, జీబ్రా క్రాసింగ్‌ల వినియోగం, ఫుట్‌పాత్‌ల ప్రాముఖ్యత, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడo మరియు వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగుల అశోక్ గారు విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించి, ప్రజెంటేషన్లు మరియు ప్రదర్శనల ద్వారా రహదారి భద్రతా చర్యలను వివరించారు. రోడ్లు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, మొబైల్ ఫోన్ వినియోగం వంటి పరధ్యానాలకు గురికాకుండా ఉండాలని, పాదచారుల కోసం కేటాయించిన జీబ్రా క్రాసింగ్‌లను మాత్రమే ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా, తమ కుటుంబ సభ్యులు మరియు సంరక్షకులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రోత్సహించాలని, రహదారి భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలియజేశారు. రోడ్డు భద్రత అనేది ప్రతి పౌరుడి ఉమ్మడి బాధ్యత అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటూ, విద్యార్థులు తమ కుటుంబాలు మరియు సమాజంలో రోడ్డు భద్రతా రాయబారులుగా మారాలని ఆకాంక్షించారు. Hyderabad Traffic