విద్యార్థులకు ఊరట! సుప్రీంకోర్టు కీలక తీర్పు
Actor ProfilePolitician

విద్యార్థులకు ఊరట! సుప్రీంకోర్టు కీలక తీర్పు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విద్యార్థులకు ఊరట! సుప్రీంకోర్టు కీలక తీర్పు
Oneindia Telugu30 Jun 2026
విద్యార్థులకు ఊరట! సుప్రీంకోర్టు కీలక తీర్పు

పశ్చిమాసియా (గల్ఫ్) దేశాలలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా సీబీఎస్‌ఈ (CBSE) క్లాస్ XII బోర్డు పరీక్షలు రద్దయి, తీవ్ర ఆందోళనలో ఉన్న ప్రైవేట్ విద్యార్థులకు ఎట్టకేలకు పెద్ద ఊరట లభించింది. గల్ఫ్ దేశాలలోని ప్రైవేట్, ఇంప్రూవ్‌మెంట్ అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక సరికొత్త జాతీయ అసెస్‌మెంట్ విధానాన్ని (National Policy) సుప్రీంకోర్టు సోమవారం రికార్డుల్లోకి తీసుకుంది. ఈ సమస్యపై దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం పరిష్కరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి, జస్టిస్ విపుల్ ఎమ్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.అసలు వివాదం ఏంటి? సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థిసౌదీ అరేబియాలోని అల్ జుబైల్‌కు చెందిన ప్రాన్షు జిగర్‌కుమార్ పటేల్ అనే సీబీఎస్‌ఈ ప్రైవేట్ అభ్యర్థి సుప్రీంకోర్టులో ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గల్ఫ్ సంక్షోభం కారణంగా అక్కడ పరీక్షలు రద్దు కావడంతో, రెగ్యులర్ విద్యార్థుల కోసం మార్చి 27, 2026న సీబీఎస్‌ఈ ఒక ప్రత్యేక అసెస్‌మెంట్ విధానాన్ని తెచ్చింది. కానీ, ప్రైవేట్ లేదా ఇంప్రూవ్‌మెంట్ రాసే అభ్యర్థుల ఫలితాల ప్రకటనపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా రిజల్ట్ లేటర్ అని నిలిపివేసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వివక్షాపూరితంగా ఉందని, తన పైచదువుల అవకాశాలను దెబ్బతీస్తోందని ఆ విద్యార్థి కోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో స్పందించిన సుప్రీంకోర్టు.. ఒక పరిష్కారంతో రావాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.ప్రైవేట్ విద్యార్థుల కోసం సరికొత్త 40:60 మార్కుల ఫార్ములాసుప్రీంకోర్టు విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై, జూన్ 21, 2026న నోటిఫై చేసిన సరికొత్త పాలసీ వివరాలను కోర్టుకు వివరించారు. రెగ్యులర్ విద్యార్థులకైతే ఇంటర్నల్ అసెస్‌మెంట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మార్కులు ఉంటాయి కానీ, ప్రైవేట్ విద్యార్థులకు ఎలాంటి స్కూల్ రికార్డులు ఉండవని, అందుకే ఈ ప్రత్యేక ఫార్ములాను తెచ్చామని చెప్పారు.Nisarga Adhikary