వందేభారత్ ’ను ప్యాసింజర్ చేశారా?.. ప్రయాణికుల గగ్గోలు
Actor ProfilePolitician

వందేభారత్ ’ను ప్యాసింజర్ చేశారా?.. ప్రయాణికుల గగ్గోలు

Total News1
Movie Updates0
Sources1
వందేభారత్ ’ను ప్యాసింజర్ చేశారా?.. ప్రయాణికుల గగ్గోలు
Sakshi14 Jun 2026
వందేభారత్ ’ను ప్యాసింజర్ చేశారా?.. ప్రయాణికుల గగ్గోలు

బెంగళూరు: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సెమీ-హై-స్పీడ్ రైలు సర్వీసుగా పేరొందిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. బెంగళూరు - ఎర్నాకులం మార్గంలో నడిచే వందేభారత్ రైలు 2026 జూన్‌ నెలలో వరుసగా గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా ఈ రైలు ఏకంగా తొమ్మిది గంటల ఆలస్యంతో గమ్యస్థానానికి చేరుకోవడంతో, ఆగ్రహించిన ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా నేరుగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ తమ ఆవేదనను, నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కారణం ఇదే: వైట్‌ఫీల్డ్ సెక్షన్‌లో పనులు ఈ తీవ్ర ఆలస్యానికి గల కారణాలను రైల్వే అధికారులు వెల్లడించారు. బెంగళూరు డివిజన్‌ పరిధిలోని వైట్‌ఫీల్డ్ సెక్షన్‌లో ట్రాఫిక్ నియంత్రణలు, అత్యవసర రైల్వే మౌలిక వసతుల నిర్వహణ పనులు జరగడం వల్లే ఈ అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరించారు. ఒకవైపు రైలు ఆలస్యం కావడంతో, అదే రేక్ (Rake) తిరుగు ప్రయాణానికి కూడా ఉపయోగించాల్సి రావడం వల్ల ‘క్యాస్కేడింగ్ ఎఫెక్ట్’తో అటు బెంగళూరు నుంచి, ఇటు ఎర్నాకులం నుంచి వచ్చే రెండు వైపుల సర్వీసులు గంటల తరబడి ఆలస్యమయ్యాయని వారు పేర్కొన్నారు. అయితే ప్రయాణికులకు ఈ ఆలస్యంపై ముందే సమాచారం ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. 9 గంటల ఆలస్యం: నరకప్రాయమైన ప్రయాణం షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2:20 గంటలకు ఎర్నాకులంలో బయలుదేరాల్సిన వందేభారత్ రైలు, సుమారు ఆరున్నర గంటల ఆలస్యంతో రాత్రి 9:07 గంటలకు బయలుదేరింది. అదే రోజు రాత్రి 11 గంటలకు బెంగళూరు చేరుకోవాల్సిన ఈ రైలు మరుసటి రోజు ఉదయం 7:51 గంటలకు చేరుకుంది. అంటే దాదాపు 9 గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే బెంగళూరు నుంచి ఉదయం 5:10 గంటలకు బయలుదేరాల్సిన తిరుగు ప్రయాణ రైలు కూడా ఐదు గంటలకు పైగా ఆలస్యంగా నడిచింది. ప్రయాణికుల ఆందోళన కేరళ, బెంగళూరు