
విజయ్ ఆంటోనీ, శశి కాంబినేషన్‌లో 'బిచ్చగాడు' తర్వాత వచ్చిన సినిమా 'వంద దేవుళ్ళు'. అమ్మకు పెళ్ళి కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు, దర్శక నిర్మాత విజయ్ ఆంటోని (Vijay Antony) ఏ సినిమా చేసినా... అందులో అర్థం, పరమార్థం ఉంటుంది. కేవలం కమర్షియల్ పర్పస్‌తో సినిమాలు చేయడం ఆయనకు అలవాటు లేని పని. ఇంతవరకూ నటుడిగా తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి సొంత సినిమాలు తీసిన విజయ్ ఆంటోని ఇప్పుడు తాను బ్యాక్ సీట్ లో కూర్చుని కథకు పెద్ద పీట వేస్తూ నిర్మించిన సినిమా 'వంద దేవుళ్ళు'. విజయ్ ఆంటోనితో 'బిచ్చగాడు' (Bichagadu) వంటి బ్లాక్ బస్టర్ మూవీని చేసిన శశి (Sasi) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. వాసవి (స్వాసిక Swasika) ఇద్దరు పిల్లల తల్లి. యుక్తవయసులోనే భర్తను పోగొట్టుకుంటుంది. అక్కడి నుంచి పిల్లలే జీవితంగా గడుపుతుంది. వితంతువు వాసవి అంటే ఊరిలో మగాళ్ళందరికీ అలుసే. అవకాశం కోసం గోతి కాడ నక్కల్లా కాచుకుని ఉంటారు. అయినా నిబ్బరంగా జీవితాన్ని సాగిస్తుందామె. ఇద్దరు మగపిల్లలు భాస్కర్ (అజయ్ దిషాన్ Ajay Dishan), వివేక్ (శక్తి Shakthi) పెళ్ళికి ఎదిగిన తర్వాత తనకూ ఓ తోడు కావాలనే భావన ఆమెలో కలుగుతుంది. అయితే ఆ నిర్ణయాన్ని తొలుత ఆమోదించని కొడుకులిద్దరూ ఆ తర్వాత మనసు మార్చుకుంటారు. తల్లికి పెళ్ళి చేయడం కోసం వరుడిని వెతకడం మొదలు పెడతారు. ఈ క్రమంలో అప్పటికే భార్యను పోగొట్టుకున్న ఏడు కొండలు (విజయ్ ఆంటోనీ)ని వివాహం చేసుకోవాలని వాసవి అనుకుంటుంది. అయితే ఆమె గ్రామానికి చెందినపెద్దిరెడ్డి (బాలాజీ శక్తివేల్) ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు... సొంత కుటుంబ సభ్యులు సైతం ఆమె నిర్ణయాన్ని తప్పు పడతారు. వీరందరి కుట్రలను ఎదుర్కొని కొడుకలిద్దరూ కలిసి తమ తల్లి పెళ్ళి ఎలా


